శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 9 ఏప్రియల్ 2021 (14:10 IST)

గౌరవంతో బతకాలి.. ఎవ్వడికీ భయపడకూడదు... అలియా భట్

బాలీవుడ్ నటి అలియా భట్ ప్రధానపాత్రలో నిర్మించిన చిత్రం "గంగూభాయ్ కతియావాడి". పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించిన ఈ చిత్రం తెలుగు టీజర్ శుక్రవారం విడుదలైంది. 
 
ముంబై మాఫియా క్వీన్‌ గంగూబాయ్‌ జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇటీవల ఈ సినిమా టీజర్‌ విడుదలైన విషయం తెలిసిందే. అయితే, తెలుగు టీజర్‌ను మాత్రం శుక్రవారం రిలీజ్ చేశారు. ‘వకీల్‌సాబ్‌’ థియేటర్లలో ఈ టీజర్‌ ప్రదర్శితమవుతోంది.
 
'గౌరవంతో బతకాలి. ఎవ్వడికీ భయపడకూడదు. పోలీసుకైనా, మంత్రికైనా, ఎమ్మెల్యేకైనా..' అని అంటున్నారు. ‘కామటిపురలో అమావాస్య రాత్రి కూడా అంధకారం ఉండదంటారు. ఎందుకంటే అక్కడ గంగూ ఉంటుంది’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్‌ ఆకట్టుకునేలా ఉంది. 
 
అలాగే ‘గంగూ చంద్రిక చంద్రుడిలానే ఉంటుంది’, ‘నేల మీద కూర్చొని భలేగా కనిపిస్తున్నావ్‌ నువ్వు. అలవాటు చేసుకో ఎందుకంటే కుర్చీ పోయిందిగా’ అంటూ ఆలియా చెప్పిన డైలాగులు, ఆమె హావభావాలు మెప్పిస్తున్నాయి. జులై 30న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.