గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 9 నవంబరు 2023 (17:33 IST)

నేను తీసిన పాత సినిమాలు ఒకసారి చూడాలనిపించింది : అల్లు అరవింద్

Allu Aravind, maju bhargavi,amala akkineni
Allu Aravind, maju bhargavi,amala akkineni
కె విశ్వనాథ్ గారి స్మారక షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఫైనల్ స్క్రీనింగ్ మరియు విజేతల ప్రకటన బుధవారం రాత్రి ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ సంధర్భంగా విజేతలను శాలువాలతో అల్లు అరవింద్, మంజు భార్గవి తదితరులు సన్మానించారు. 
 
స్క్రీనింగ్‌ అనంతరం ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ మాట్లాడుతూ, విశ్వనాథ్‌ గారితో నేను యంగ్‌గా వున్నప్పుడే శుభలేఖ సినిమా తీశాను. అది అదృష్టంగా భావిస్తున్నా. ఆయన నాకు ఇచ్చిన గిఫ్ట్‌గా కూడా ఫీలవుతాను. విజేతలు 8 మంది స్టేజీ పైకి వచ్చారు. అందరిలోనూ ఎంతో టాలెంట్‌ వుంది. వీరంతా లఘు సినిమాను తీసి ప్రశసంలు పొందారు. మీ టాలెంట్‌ను మహావృక్షంలా మలుచుకోవాలని కోరుకుంటున్నాను. అన్ని సినిమాలు చూశాను. మంచి విలువలతో కూడినవిగా అనిపించాయి. ఈ సినిమాలు చూడగానే నేను తీసిన పాత సినిమాలు కూడా ఒకసారి చూడాలనిపించింది అని చెప్పారు.
 
నటి, డాన్సర్  మంజు భార్గవి మాట్లాడుతూ, లఘు చిత్రాలు ఎలా వుంటాయో అని మొదట్లో అనిపించింది. కానీ చూడగానే కథ, ఎమోషన్స్‌ ఇందులో వున్నాయి. రెండున్నర గంటలు గొప్ప ఎచీవ్‌మెంట్‌గా అనిపించాయి. ప్రతి షాట్‌ ఫిలిం చూశాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆనందంగావుంది. నా గురువుగారు వెంపటి చినసత్యం గారి వల్లే నేను డాన్సర్‌గా 2వేల స్టేజీ పెర్‌ఫార్మెన్స్‌ చేశాను. వారి స్పూర్తితో బామకలాపం చేశాను. అందులో భాగంగానే శివ, శ్రీనివాస, కృష్ణ పాత్రలు నేను వేశాను. విశ్వనాథ్‌గారి శంకరాభరణం నా కెరీర్‌ మార్చేసింది. కేరళలో 50పైగా పెర్‌ఫార్మెన్స్‌ చేశాను. 43 ఏళ్ళయినా ఆ సినిమా ఎఫెక్ట్‌ ఇంకా వుంది. దేశంలో ఎక్కడైనా డాన్స్‌ కాంపిటేషన్‌కు వెళితే నన్ను గుర్తుపట్టి నేను శంకరాభరణంలో చేసిన ఇంటర్‌వెల్‌ భాగాన్ని చక్కని పెయింట్‌గా వేసి గిఫ్ట్‌గా ఇచ్చేవారు. ఇప్పుడు ఈ షాట్‌ ఫిలింస్‌లోనూ విశ్వనాథ్‌గారి ఛాయలు కనిపించాయి అని తెలిపారు.
 
నటి అమల అక్కినేని మాట్లాడుతూ, విశ్వనాథ్‌ గారి మెమోరియల్‌ షాట్‌ పిలింకాంటెస్ట్‌ను ఇండికా ఫిలింస్‌ ఆర్గనైజింగ్‌ చేయడం ఆనందంగావుంది. యంగర్‌ జనరేషన్‌కు స్పూర్తిగా వుంది. మా మామగారు నాగేశ్వరరావుగారితో విశ్వనాథ్‌గారికి మంచి స్నేహసంబంధాలు వుండేవి.  నేను చిన్నతనంలోగా ఉండగా. శంకరాభరణం చూశాను. నేను భరతనాట్యం కూడా నేర్చుకున్నాను. తెలుగు సినమాకు ఒక పిల్లర్ గా విశ్వనాథ్‌గారు నిలిచారు. ఆర్ట్‌, కల్చర్‌, డాన్స్‌, మ్యూజిక్‌ అన్నీ కలగలిపిన దర్శకుడు ఆయన. ఈరోజు నేను చూసిన లఘుచిత్రాలు మంచి కథలతో వున్నాయి.  అరవింద్‌గారు ఇప్పటి ఫిలింమేకర్స్‌కు స్పూర్తిగా నిలిచారు అని అన్నారు.
 
ఇండికా పిక్చర్స్‌ అధినేత మట్లాడుతూ, ఈ లఘు చిత్రాలు ఇండియన్‌ కల్చర్‌ను వెలుగులోకి తీసుకురావాలని చేసినవి. గురుశిష్య పరంపరలో మన కల్చర్‌ ఇమిడి వుంది. అది రిఫ్లక్ట్‌ చేసేవిధంగా మా లఘు సినిమాలు వుంటాయి. నాలుగేళ్ళ క్రితమే ఇండికా పిక్చర్స్‌ నెలకొల్పాం. పాజిటివ్‌ ఫిలింస్‌, కల్చర్‌, హెరిటేజ్‌ పిలింస్‌ చేయాలనుకున్నాం. అందులో భాగంగా విశ్వనాథ్‌గారి జోనర్‌ చేయాలనుకున్నాం. ప్రతి ఏడాది కాంటెస్ట్‌ ఏర్పాటు చేస్తాం అని అన్నారు.
 
లఘు చిత్రాల దర్శకుడు మాట్లాడుతూ, ఇలాంటిఫ్లాట్‌పాం వుంటేనే మంచి సినిమాలు చేయగలం అని అన్నారు. ఐశ్వర్య మాట్లాడుతూ,  అనన్య పాత్ర రాస్తున్నప్పుడు నా ఎమోషన్స్‌ను కూడా రిప్లక్ట్‌ అయ్యాయి. నటీనటులు అంతా కొత్తవారే. సినిమా అయ్యేవంతవరకు చాలా ఎనర్జీతో వున్నారు. ఇక నేను డాన్స్‌ పెర్‌ఫార్మ్‌ చేసిన వాటికి విశ్వనాథ్‌గారు జడ్జిగా వచ్చేవారని గుర్తు చేసుకున్నారు.
 
కిట్టగాడు చిత్ర దర్శకుడు మాట్లాడుతూ, ఫాదర్‌ అండ్‌ సన్‌ రిలేషన్‌తో 18 మంది టీమ్‌ కలిసి కిట్టుగాడి కథ చేశాం. అన్నపూర్ణ కాలేజీలో ఫిలిం మేకింగ్‌ చేశాను అన్నారు. 
దర్శకుడు షణ్ముక కార్తీక్‌, హరికిరణ్‌, కె.ఎల్‌.నారాయణ, మైత్రీ నవీన్‌ తదితరులు పాల్గొన్నారు.