సోమవారం, 31 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : శుక్రవారం, 28 మార్చి 2025 (13:56 IST)

Allu Arjun : 21 ఏళ్ళకు ఎంట్రీ, 22 ఏళ్ళ కెరీర్ లో ఎత్తుపల్లాలు చూసిన బన్నీ

Allu Arjun 22 years
Allu Arjun 22 years
బన్నీ అంటూ ముద్దుగా ఫ్యాన్స్ తో పిలుచుకునే అల్లు అర్జున్ 22 ఏళ్ళ కెరీర్ లో 2005 ప్రత్యేకమైందిగా చెప్పుకోవచ్చు.  మెగా కుటుంబం నుంచి వచ్చిన నటుడిగా మొదట్లో ముద్ర వేసుకున్నాడు. కాలక్రమేణా తనస్థాయిని పెంచుకుంటూ ఐకాన్ గా మారిపోయాడు. అందుకు దర్శకుడు సుకుమార్ తోడ్పాటు ఎనలేనిది.
 
2001లో డాడీ సినిమా షూటింగ్ లో వుండగా, ఓసారి చిరంజీవి షూటింగ్ లో వున్న రాజేంద్రప్రసాద్ ను పిలిచి ఓ కుర్రాడు మీ ముందు డాన్స్ వేస్తాడట. మీ జడ్జిమెంట్ చూసి చెప్పగలరని అన్నారు. ఆ తర్వాత తను అల్ల అరవింద్ కుమారుడని చెప్పడం, మా ఫ్రెండ్ కొడుకు అంటూ మొహమాటం లేకుండా.. సింగిల్ కాలితో డాన్స్ వేసిన విధానం, తపన చూసి రాజేంద్రప్రసాద్.. ఈ కుర్రాడు పెద్ద స్టార్ అయిపోతాడని దీవెనలు అందించాడు. రాజేంద్రప్రసాద్ దగ్గర పలు టిప్స్ కూడా నేర్చుకుని ఆయనతో పాటు తనజర్నీని కూడా సాగించాడు అల్లు అర్జున్. 
 
నేడు, 2025, మార్చి 28న అల్లు అర్జున్ కెరీర్ 22 ఏళ్ళకు చేరింది. ఈ సందర్భంగా తన కెరీర్ ను ఒక్కసారి గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈయనేం నటుడు అంటూ గంగోత్రి సినిమా టైంలో అనిపించుకున్న బన్నీ క్రమేణా ఐకాన్ స్టార్ గా ఎదగడం మామూలు విషయం కాదు.
 
అలా 2001లో సినీ పెద్దల ఆశీస్సులతో కె. రాఘవేంద్రరావు దర్శకత్వంలో గంగోత్రి చిత్రంలో నటించగా 2003లో విడుదలైంది. ఆ టైంలో అసలు ఇతనెలా నటుడు అయ్యాడంటూ పలువురు కామెంట్లు చేసిన సందర్భాలున్నాయి. కానీ తనలోని డాన్సర్ తోపాటు నటుడిని కూడా మెరుగులు దిద్దుకుంటూ ఒక్కో స్టెప్ ఎక్కుతూ వచ్చాడు.  
 
22 సంవత్సరాల క్రితం ఇదే రోజున, ఒక యువకుడు తన కళ్ళలో కలలతో పరిశ్రమలోకి అడుగుపెట్టాడు... నేడు మన ప్రియమైన ఐకాన్ స్టార్ గా ఎదిగాడంటూ నేను ఆయన ఫ్యాన్స్ కితాబిస్తున్నారు.  దేశంలోని అతిపెద్ద స్టార్లలో ఒకరిగా నిలిచారన్నారు.
 
బ్లాక్‌బస్టర్ ప్రదర్శనల నుండి మరపురాని పాత్రల వరకు. అతని అంకితభావం, బహుముఖ ప్రజ్ఞ, జీవితాతీత ఉనికి అతన్ని భారతీయ సినిమాలో నిజమైన శక్తిగా మార్చాయి.
 
కాలక్రమేణా అత్యధిక పారితోషికం తీసుకునే నటులలో ఒకడుగా నిలిచాడు. జాతీయ చలనచిత్ర అవార్డు , ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, మూడు నంది అవార్డులు కెరీర్ లో వున్నాయి. అలా "స్టైలిష్ స్టార్,  "ఐకాన్ స్టార్" గాప్రసిద్ధి చెందాడు. సుకుమార్ కల్ట్ క్లాసిక్ ఆర్య (2004) లో నటించి ఆయన ప్రముఖ పాత్ర పోషించారు. అక్కడనుంచి అర్జున్ కెరీర్ ను సుకుమార్ తన భుజానపైన వేసుకున్నాడు. పుష్ప సినిమాతో ఒక్కసారిగా ప్రపంచాన్ని ఆకర్షించాడు. 
 
 బన్నీ, దేశముదురు వంటి  యాక్షన్ చిత్రాలతో పాటు, రొమాంటిక్ డ్రామా పరుగు లో నటించారు. జులాయి, రేసు గుర్రం, S/O సత్యమూర్తి, సరైనోడు DJ, అల వైకుంఠపురంలో వంటి విజయవంతమైన చిత్రాలలో నటించారు. అయితే తన కెరీర్ ను బాగా బిల్డప్ చేసుకున్న అల్లు అర్జున్ కు పుష్ప 2 సినిమాకు వచ్చేసరికి వివాదాలకు దారితీసింది. తన సినిమా ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లోని సంథ్య థియేటర్ లో ప్రీమియర్ కు వచ్చినప్పుడు ఇద్దరు చనిపోవడం చాలా వివాదంగా మారడంతోపాటు మానసికంగా బాగా నలిగిపోయారు. ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను చర్లపల్లి జైలుకు కూడా తరలించింది.  
 
ఆ పరిణామాలు తర్వాత తన కెరీర్ ను మరింత బిల్డప్ చేసుకునేందుకు పాన్ ఇండియా సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు. అట్లీ దర్శకత్వంలో సినిమా రాబోతోంది. త్రివిక్రమ్ సినిమాను చేయబోతున్నారు. అలా 22 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లు అర్జున్ ఇలానే ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేసే పాత్రలను చేస్తూ కొత్త కథలతో మరో పాతికేళ్లు ఇలానే కెరీర్ కొనసాగించాలని ఆశిద్దాం.