గురువారం, 19 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 27 అక్టోబరు 2023 (13:05 IST)

నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచిన అల్లు అర్జున్.. ప్రకాష్ రాజ్

Allu arjun new avatar
జాతీయ అవార్డు పొందిన తెలుగు నటీనటులను టాలీవుడ్ గౌరవించకపోతే, ఇతర పరిశ్రమల వారు ఎలా ఆదరిస్తారని బహుముఖ నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. జాతీయ అవార్డు గ్రహీతలను సన్మానించేందుకు మైత్రీ మూవీ మేకర్స్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 
అంత:పురం సినిమాకు 25 ఏళ్ల క్రితం నేషనల్ అవార్డ్ వచ్చిందని, అయితే అప్పుడు టాలీవుడ్ పెద్దలు ఎవరూ పట్టించుకోలేదని ప్రకాష్ రాజ్ అన్నారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇటీవల అల్లు అర్జున్, జాతీయ అవార్డు గెలుచుకున్న తెలుగు సినీ ప్రముఖులను సత్కరించింది. ఈ వేడుకలో ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
 
అల్లు అర్జున్ జాతీయ అవార్డు తెలుగు వారందరికీ గర్వకారణమని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఇలాంటి సన్మాన వేడుకలకు తెలుగు హీరోలు, ఇండస్ట్రీ పెద్దలు ఎందుకు కలవరని ప్రకాష్ రాజ్ ప్రస్తావించారు. అవార్డులు వస్తే ఒకరినొకరు మెచ్చుకోవడం మరిచిపోతారని చెప్పారు. ఇంట్లో మనల్ని మనం గౌరవించుకోకపోతే ఎదుటివాళ్లు ఎలా గౌరవిస్తారని ప్రకాష్ రాజ్ అన్నారు.
 
ఇలాంటి వివక్ష భరించలేక చాలా రోజులుగా ఫిల్మ్ ఫెస్టివల్స్‌కు దూరంగా ఉంటున్నానని, అయితే మైత్రీ మూవీ మేకర్స్ ఈ అవార్డ్ షో గురించి చెప్పగానే వెంటనే వచ్చానని ప్రకాష్ రాజ్ తెలిపారు. 
 
ఈ వేడుకకు సీనియర్లు దూరం కావడం బాధాకరమన్నారు. మరోవైపు యువ దర్శకులు వస్తుండటం ఆనందంగా ఉందని ప్రకాష్ రాజ్ అన్నారు. జాతీయ అవార్డు గెలుచుకున్న అల్లు అర్జున్ నేటి యువతకు స్ఫూర్తిగా నిలిచారని ప్రకాష్ రాజ్ కొనియాడారు.