స్నేహారెడ్డి డెలివరీకి తర్వాతే ''డీజే'' షూటింగ్.. డిసైడైపోయిన బన్నీ..
భార్య స్నేహారెడ్డిపై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఎంత ప్రేమో అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతోపాటు కేరళలోనూ మన బన్నీ టాప్ స్టారే. ఇటీవలే తమిళంలో పాగా వేయడానికి కూడా అల్లు అర్జున్ సిద్ధమవుతున్
భార్య స్నేహారెడ్డిపై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఎంత ప్రేమో అందరికీ తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతోపాటు కేరళలోనూ మన బన్నీ టాప్ స్టారే. ఇటీవలే తమిళంలో పాగా వేయడానికి కూడా అల్లు అర్జున్ సిద్ధమవుతున్నాడు. తాజాగా బన్నీ హరీష్ శంకర్ దర్శకత్వంలో 'డీజే (దువ్వాడ జగన్నాథం)' సినిమాలో నటిస్తున్నాడు. పూజా హెగ్డే ఇందులో కథానాయికగా నటిస్తోంది.
ఈ సినిమా లాంఛనంగా పూజాకార్యక్రమాలతో ఎప్పుడో పూర్తయినా.. షూటింగ్ మాత్రం ఇంకా ఆరంభం కాలేదు. ఇందుకు కారణం బన్నీయేనట. బన్నీ భార్య స్నేహా రెడ్డి ప్రస్తుతం ప్రెగ్నెంట్ కావడానికి తోడు వచ్చే నెలలో ఆమె రెండో బిడ్డకు జన్మనిస్తుందని.. అంతవరకు ఆమెతోనే గడిపి.. తర్వాతే షూటింగ్‌లో పాల్గొనాలని బన్నీ నిర్ణయించినట్లు సమాచారం.
స్నేహ డెలివరీ అయిన తర్వాత నవంబర్‌లోనే 'డీజే' షూటింగ్‌లో పాల్గొనాలని బన్నీ నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ సినిమా షూటింగ్‌లో ఎక్కువ భాగాగం హైదరాబాదులోనే ఉంటుందని సమాచారం.