శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Srinivas
Last Modified: బుధవారం, 6 జూన్ 2018 (21:36 IST)

డైరెక్ట‌ర్స్ మీటింగ్ పైన బ‌న్నీ ఏమ‌ని ట్వీట్ చేసాడో తెలుసా..?

టాలీవుడ్‌లో ప్ర‌జెంట్ స‌క్స‌స్‌లో ఉన్న డైరెక్ట‌ర్స్ కొంతమంది ద‌ర్శ‌కులు ఓచోట క‌లిసారు. ఇంత‌కీ ఎక్క‌డ కలిసారు..? ఎందుకు క‌లిసారు..? అనుకుంటున్నారా..? ఈ మీటింగ్ ఏర్పాటు చేసింది డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి. త‌న ఇంట్లోనే ఈ డైరెక్ట‌ర్స్‌కి పార్టీ ఇచ్చాడ‌ట‌

టాలీవుడ్‌లో ప్ర‌జెంట్ స‌క్స‌స్‌లో ఉన్న డైరెక్ట‌ర్స్ కొంతమంది ద‌ర్శ‌కులు ఓచోట క‌లిసారు. ఇంత‌కీ ఎక్క‌డ కలిసారు..? ఎందుకు క‌లిసారు..? అనుకుంటున్నారా..? ఈ మీటింగ్ ఏర్పాటు చేసింది డైరెక్ట‌ర్ వంశీ పైడిప‌ల్లి. త‌న ఇంట్లోనే ఈ డైరెక్ట‌ర్స్‌కి పార్టీ ఇచ్చాడ‌ట‌. రాత్రి స్టార్ట్ అయిన ఈ పార్టీ తెల్లారు జాము 4 గంట‌ల వ‌ర‌కు జ‌రిగింద‌ట‌. ఈ విష‌యాన్ని ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెలియ‌చేసారు. ఈ పార్టీలో కొర‌టాల శివ‌, సుకుమార్, క్రిష్, సందీప్ వంగా, నాగ్ అశ్విన్, హ‌రీష్ శంక‌ర్, అనిల్ రావిపూడి త‌దిత‌రులు పాల్గొన్నారు. 
 
ఇంత‌కీ బ‌న్నీ ఏమ‌ని ట్వీట్ చేసాడంటే... డైరెక్ట‌ర్స్‌ని ఒక ఫ్రేమ్‌లోకి తీసుకురావాల‌నే వంశీ పైడిప‌ల్లి, సుకుమార్‌ల ఆలోచ‌న బాగుంది. అంద‌రినీ ఒక ఫ్రేమ్‌లో చూడ‌డం బాగుంది. రాజ‌మౌళి గారు, కొర‌టాల శివ‌, హ‌రీష్ శంక‌ర్, సందీప్ వంగా, నాగ్ అశ్విన్, అనిల్ రావిపూడి... వీరంద‌రూ ఒక చోట‌కి వ‌చ్చి త‌మలో ఐక్య‌త ఉంద‌ని చాటుకున్నారు అన్నాడు. అదీ... సంగ‌తి!