అల్లుడు అదుర్స్ రివ్యూ.. అరిగిపోయిన ఫార్ములా వర్కవుట్ కాలేదు..
అల్లుడు అదుర్స్ సినిమా ప్రేక్షకులకు వర్కౌట్ కాలేదనే రివ్యూ వచ్చేసింది. ఎప్పుడో అరిగిపోయిన ఫార్మూలాను పట్టుకొచ్చి ప్రేక్షకుల చేత అల్లుడు అదుర్స్' అనిపించాలని ప్రయత్నించారు. కానీ అది వర్కవుట్ కానట్టు కనిపిస్తోంది.
సినిమా ఫ్యామిలి, రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రంగా ఇది తెరకెక్కింది. ఇందులో బెల్లంకొండ శ్రీనివాస్, నభా నటేష్, అను ఎమ్మాన్యుయేల్, రాయ్‌లక్ష్మీ, సోనూ సూద్, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాకి దర్శకత్వం సంతోష్ శ్రీనివాస్ వహించారు.
నిర్మాణ సంస్థ సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై గొర్రేల సుబ్రమణ్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.
ఈ చిత్రానికి కెమెరా: చోటా కె. నాయుడు, ఆర్ట్ అవినాష్ కొల్లా, ఎడిటింగ్ తమ్మిరాజు, యాక్షన్: రామ్ లక్ష్మణ్, మాటలు: శ్రీకాంత్ విస్సా.
కథ
సాయి శ్రీనివాస్ (బెల్లంకొండ శ్రీనివాస్) చిన్నప్పుడే స్కూల్ ఏజ్‌లో ప్రేమలో పడతాడు. అలా వసుంధర (అను ఇమాన్యుయేల్) శ్రీను ఫస్ట్ లవ్ అయిపోతుంది. కానీ వసుంధర అలా చిన్నతనంలో దూరమవుతుంది. అప్పటి నుంచి ఆడవాళ్లకు, ప్రేమకు శ్రీను దూరంగా ఉంటాడు.
అలాంటి శ్రీను తొలిచూపులోనే కౌముది (నభా నటేష్) ప్రేమలో పడతాడు. ఆ తరువాత కౌముది, వసుందర, శ్రీను కథలు ఎలా ముగిశాయన్నదే అల్లుడు అదుర్స్. మిగిలిన కథను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.