శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. సమీక్ష
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 13 జనవరి 2021 (18:26 IST)

sankranti movie master review, విజయ్ - సేతుపతి cock fight, రివ్యూ (video)

మెయిన్ పాయింట్: ఒక కళాశాల ప్రొఫెసర్ యువ నేరస్థులను దిద్దుబాటు చేసేందుకు వెళతాడు, అంతేకాకుండా తన నేర సామ్రాజ్యాన్ని మరింతగా పెంచుకోవడానికి వారిని దోపిడీ చేస్తున్న రౌడీతో ఢీకొంటాడు.
 
దక్షిణాది నటుడు విజయ్ నటించిన 'మాస్టర్' ఈరోజు భారత్‌తో సహా పలు దేశాల్లో విడుదలైంది. ‘మాస్టర్’ సినిమా ద్వారా లోకేష్ కనగరాజ్ హీరో విజయ్‌ను మరింత పవర్‌ఫుల్‌గా చూపించాడు. విజయ్ సేతుపతి పాత్ర ఈ చిత్రానికి అతిపెద్ద బలం. పాటల నేపథ్య సంగీతం మరియు సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉన్నాయి. అద్భుతమైన విజయ్ పరిచయం సినిమాను ఎక్కడికో తీసుకెళ్తున్నట్లుంది.
కానీ అదే సమయంలో కళాశాల దృశ్యాలు చాలా పేలవంగా ఉన్నాయి. ఇంటర్వెల్ వరకూ ఆకట్టుకున్నప్పటికీ, ఈ చిత్రం నిడివి భారీ మైనస్ పాయింట్ అని ఒక ప్రేక్షకుడు ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు.
 
చాలా యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయని, లోకేష్ కనగరాజ్ మామూలు స్క్రీన్ ప్లే మ్యాజిక్ మిస్ అవుతున్నారని, సినిమా నిడివి చాలా పొడవుగా ఉందని కొందరు ఫిర్యాదు చేశారు. ఏదేమైనప్పటికీ దర్శకుడు లోకేష్ కనగరాజ్ తీసిన ఈ చిత్రం క్లాస్ మాస్ ప్రేక్షకులు చూడదగ్గదేనని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేశారు.