మంగళవారం, 8 జులై 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 6 సెప్టెంబరు 2016 (11:25 IST)

అమితాబ్ లేఖ.. ఆ లేఖ సారాంశం ఆరాధ్యకు అర్థమయ్యేసరికి.. అప్పుడు నేను బిగ్‌బిని కాను..

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనవరాళ్లకు లేఖ రాశారు. తన మనవరాళ్లు ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ల కూతురు ఆరాధ్య, శ్వేతానందా-నిఖిల్‌ల కూతురు నవేలి నందాలకు మాత్రమే కాదని మిగతా అ

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, బిగ్ బీ అమితాబ్ బచ్చన్ మనవరాళ్లకు లేఖ రాశారు. తన మనవరాళ్లు ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్ల కూతురు ఆరాధ్య, శ్వేతానందా-నిఖిల్‌ల కూతురు నవేలి నందాలకు మాత్రమే కాదని మిగతా అందరి మనవరాళ్లకి అని అమితాబ్ అన్నారు.

ఆత్మగౌరవంతో బతకాలని, మీ ఇష్టాఇష్టాల మేరకే జీవితభాగస్వాములు ఎన్నుకోవాలని సూచించారు. ప్రపంచ పోకడలపై అప్రమత్తంగా ఉండాలని, సొంతనిర్ణయాలు తీసుకునే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
 
స్వదస్తూరి ఇంగ్లిష్‌లో రాసిన లేఖను తానే చదివి వినిపించిన వీడియోను సైతం బిగ్ బి సోషల్ మీడియాకు అనుసంధానం చేశారు. మహిళలపై జరుగుతున్న అన్యాయాలు ఎప్పుడు తెలసుకుంటారో నేనైతే 2016లో చూస్తున్నా. వాటినే మీతో పంచుకుంటున్నా అని బచ్చన్ లేఖలో పేర్కొన్నారు. 
 
సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపై మనవరాళ్లకు అమితాబ్ ఈ లేఖను అంకితం చేశారు. ఫేమ్ కలిగిన కుటుంబంలో జన్మించిన మీకు.. మహిళలకు ఎదురయ్యే చేదు అనుభవాల నుంచి తప్పించుకునే అవకాశాలను మాత్రం ఆ 'ఫేమ్' ఇవ్వలేదని లేఖలో పేర్కొనడం విశేషం. 
 
డియర్ నవ్య, ఆరాధ్య.. మీ ముత్తాత గార్లు అయిన డా.హరివన్ష రాయ్ బచ్చన్, హెచ్‌పీ నందల పేర్లు మీ ఇంటిపేరుగా నిలవడం వల్ల మీకు ఒక గుర్తింపు వస్తుంది. మీరు నంద అయినా లేక బచ్చన్ అయినా ముందు గుర్తించవలసింది మీరు కూడ ఒక మహిళేనని గుర్తించుకోండి అన్నారు. మీరు మహిళలు కాబట్టే ఇతరులు వారి వారి ఆలోచనలు మీపై రుద్దడానికి ప్రయత్నిస్తారు. మీరు ఎలాంటి దుస్తులు ధరించాలో, ఎలా ఉండాలో, ఎవరిని కలవాలో, ఎక్కడి వెళ్లాలో.. కూడా వాళ్లే చెప్తారు.
 
వారి ఆలోచనల నీడల్లో మీరు జీవించొద్దు. మీ తెలివితేటలతో మీ జీవితాన్ని మీరే నిర్ణయించుకునే స్థాయికి ఎదగాలి. మీ గుణం మంచిది అనడానికి మీరు వేసుకునే స్కర్ట్ పొడవు సింబల్ అనే ఎదుటివారిని మాటలను నమ్మొద్దు. మీ స్నేహితులను మీరే ఎన్నుకోండి. మీకు ఎవరిని పెళ్లాడాలని అనిపిస్తే వారినే వివాహం చేసుకోండి.

అనవసర కారణాలతో ఇతరులను వివాహం చేసుకోకండి. ఇతరుల గురించి ఆలోచించకండి. ఇతరుల కోసం జీవించకండి. మీ కర్మలకు కర్త, క్రియ మీరే కావాలి. అప్పుడే మీ తప్పులను మీరే సరిదిద్దుకోగలుగుతారు.
 
ఆరాధ్య.. ఈ లేఖ సారాంశం ఆరాధ్యకు అర్థమయ్యే సమయానికి తాను అందుబాటులో ఉండకపోవచ్చు. కానీ, తాను ఈ లేఖలో చెప్తున్నవి ఆ సమయానికి ఇలానే ఉంటాయని భావిస్తున్నాను. మహిళగా జీవించడం కష్టమే కావొచ్చు. ప్రపంచంలో ఉన్న మహిళలకు నువ్వు ఉదాహరణగా నిలవొచ్చు. అదే తనకు గౌరవం.. అప్పుడు తాను అమితాబ్ బచ్చన్‌ను కాదు ఆరాధ్యకు తాతయ్యను అవుతాను అంటూ లేఖను రాశారు.