అమీ జాక్సన్ చేతికి రింగ్ తొడిగిన బ్రిటిష్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్
బ్రిటీష్ నటుడు ఎడ్ వెస్ట్‌విక్‌తో ప్రేమలో వున్న నటి అమీ జాక్సన్ మ్యారేజ్ ప్రతిపాదనను అంగీకరించింది. ప్రసిద్ధి చెందిన స్విట్జర్లాండ్‌లోని ఒక వంతెనపై "గాసిప్ గర్ల్"గా పేరున్న అమీ జాక్సన్‌పై రింగు చూపిస్తూ ఎడ్ వెస్ట్‌విక్ మోకాలిపై పడిపోయాడు.
ఈ జంట తమ వివాహ ఉంగరాలను మార్చుకున్నారు. ఎడ్ వెస్టిక్ ప్రపోజ్ చేస్తున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. "హెల్ ఎస్," అని ఆమె పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చింది. ఆమె ఇంతకుముందు వ్యాపారవేత్త జార్జ్ పనాయోటౌతో సహజీవనం చేసింది. ఈ దంపతుల ద్వారా అమీ జాక్సన్‌కు కుమారుడు ఉన్నాడు. అయితే, ఈ జంట చివరికి విడిపోయింది.
బ్రిటీష్ సంతతికి చెందిన అమీ జాక్సన్ అనేక భారతీయ చిత్రాలలో కనిపించింది. ఆమె రామ్ చరణ్ సరసన "ఎవడు" చిత్రంలో కూడా నటించింది. ఇది ఆమెకు రెండో నిశ్చితార్థం కావడం గమనార్హం.