శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 7 డిశెంబరు 2020 (14:38 IST)

'కేజీఎఫ్ -2' క్లైమాక్స్‌కు వచ్చేసింది..

డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూల్‌గా 'కేజీఎఫ్ -2' పతాక సన్నివేశాలకు సంబంధించిన వర్క్ జరుపుతున్నాడు. నవంబర్ చివరి వారంలో హైదరాబాద్ ఫిల్మ్ సిటీలో హీరో యశ్, విలన్ సంజయ్ దత్ పై కీలక సన్నివేశాలను ప్రశాంత్ నీల్ చిత్రీకరించాడు. అయితే... నవంబర్30న బ్రేక్ ఇచ్చిన ప్రశాంత్ నీత్ తాజాగా మళ్ళీ క్లైమాక్స్ బాలెన్స్ వర్క్ షూటింగ్ మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. 
 
ఈ భారీ యాక్షన్ ఎపిసోడ్ను తమిళ ఫైట్ మాస్టర్స్ అన్బు, అరివు బ్రదర్స్ నేతృత్వంలో చిత్రీకరిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను 'క్లైమాక్స్ ఇట్ ఈజ్, రాకీ వర్సెస్ అథేరా' అనే కాప్షన్ తో ప్రశాంత్ నీల్ ట్వీట్ చేశాడు.
 
అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ను పూర్తి చేసి, జనవరి 8న హీరో యశ్ బర్త్ డే సందర్భంగా టీజర్‌ను రిలీజ్ చేస్తారని తెలిసిందే. ఇకపోతే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో ప్రశాంత్ నీల్ 'సలార్' సినిమా చేయబోతున్నాడనే ప్రకటన ఇటు తెలుగు, అటు కన్నడ రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.