బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : గురువారం, 22 జూన్ 2017 (11:39 IST)

నాకు అవి భారీగా పెరిగాయా? ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నానా?

బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ గురించి తెలియనివారుండరు. ఇటీవలే ఈ యాంకర్‌ను అపుడపుడూ సినీ ఆఫర్లు కూడా వరిస్తున్నాయి. తాజాగా ఈ అమ్మడు గురించి ఓ వీడియో వార్త యూట్యూబ్‌లో హల్‌చల్ చేసింది.

బుల్లితెర హాట్ యాంకర్ అనసూయ గురించి తెలియనివారుండరు. ఇటీవలే ఈ యాంకర్‌ను అపుడపుడూ సినీ ఆఫర్లు కూడా వరిస్తున్నాయి. తాజాగా ఈ అమ్మడు గురించి ఓ వీడియో వార్త యూట్యూబ్‌లో హల్‌చల్ చేసింది. ఆ వార్త సారాంశం ఏమిటంటే... 'అనసూయ ఎద అందాలతో పాటు.. నడుము సైజు విపరీతంగా పెరిగిపోవడంతో సన్నబడేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నట్టు' సమాచారం. ఈ వీడియో వైరల్‌గా మారడంతో అనసూయ దృష్టికి వెళ్లింది.
 
దీంతో ఆమె కాస్తంత ఘాటుగానే స్పందించింది. ‘చాలా రోజులుగా నా గురించి ఎటువంటి వార్తలూ రాకపోయేసరికి ఇలాంటి కొత్త వార్త పుట్టించారు. నేను ప్లాస్టిక్‌ సర్జరీ చేయించుకుంటున్నాననడం పూర్తిగా అబద్ధం. నన్ను సంప్రదించకుండా ఇష్టమొచ్చినట్టు వార్తలు రాసేస్తున్నారు. అయినా ప్లాస్టిక్‌ సర్జరీలాంటి షార్ట్‌కట్స్‌ను నేను నమ్మన’ని ఓ ఫాలోయర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా అనసూయ తన ట్విట్టర్‌ ఖాతాలో రాసింది.