ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 29 డిశెంబరు 2021 (23:11 IST)

ప్రియుడు బ్రేకప్ చెప్పినా పట్టించుకోని లాస్య.. భర్త చేత అంట్లు తోమించి?

యాంకర్, బిగ్ బాస్ పార్టిసిపెంట్ లాస్య మంజునాథ్ తన అధికారిక ఇన్‌స్టా ఖాతా ద్వారా ఓ రీల్‌ని షేర్ చేస్తూ అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అయితే ఇంతకీ ఆ రీల్ లో ఏముందంటే లాస్య మంజునాథ్ భోజనం చేస్తుండగా తన ప్రియుడు ఫోన్ చేసి బ్రేకప్ అని చెప్పినప్పటికీ ఏ మాత్రం ఫీలవకుండా భోజనం తింటూ కనిపించింది. 
 
దీంతో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అలాగే కొందరు నెటిజన్లు ఈ వీడియో పై స్పందిస్తూ రీల్ వీడియో కావడంతో లాస్య మంజునాథ్ బాగానే నటించిందని కానీ రియల్ లైఫ్ లో మాత్రం ప్రేమ, పెళ్ళి వంటి బంధాలకి చాలా విలువ ఇస్తుందని కామెంట్లు చేస్తున్నారు.
 
ఇక ఆ మధ్య ఏకంగా గా లాస్య మంజునాథ్ తెలుగు ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వం వహించిన పుష్ప చిత్రంలోని ఉ అంటావా మావా ఉహూ అంటావా అనే పాట కి రీల్ చేస్తూ ఏకంగా తన భర్త మంజునాథ్ ని బెదిరిస్తూ అంట్లు తోమించింది. దీంతో ఈ వీడియో కూడా బాగానే వైరల్ అయింది. 
 
ప్రేమించి పెళ్లి చేసుకున్న లాస్య మంజునాథ్ ఇటు లైఫ్‌ని అటు పర్సనల్ లైఫ్‌ని బాగానే బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళుతోంది.