గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: బుధవారం, 17 మార్చి 2021 (16:59 IST)

జాతి రత్నాలు చూస్తూ నిద్రపోయానన్న యాంకర్, ఏం మీ ఆయనతో వెళ్లావా? అంటూ నవీన్ ప్రశ్న

జాతి రత్నాలు. సైలెంటుగా వచ్చి బాక్సాఫీస్ వద్ద బిగ్ బ్రేక్ ఇచ్చేసింది. కాసుల వర్షం కురిపిస్తోంది. థియేటరుకి వెళ్లి హాయిగా ఎంజాయ్ చేస్తున్నామంటున్నారు ఆడియెన్స్. కానీ జాతి రత్నాలు టీంను ఇంటర్వ్యూ చేసిన ఓ ప్రముఖ మీడియా ఛానల్ యాంకర్ మాత్రం పంచ్ వేయాలనుకుందో... నిజంగానో చెప్పిందో కానీ జాతి రత్నాల టీంకి దిమ్మతిరిగే పంచ్ వేసింది.
 
యాంకర్ రాములమ్మ అంటే అందరికీ తెలిసినదే. ఆమె యాంకరింగ్ రచ్చరచ్చగా వుంటుంది. అదే స్థాయిలో ఆమె జాతి రత్నాలు టీంతో ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... జాతిరత్నాలు చూస్తూ తను 20 నిమిషాల పాటు నిద్రపోయానంటూ చెప్పి షాకిచ్చింది. ఈ మాట విన్న జాతిరత్నాలు షాకయ్యారు. వామ్మో... బ్లాక్ బస్టర్ చిత్రాన్ని చూసేందుకు వెళ్లి నిద్రపోయారంటే ఏదో కారణం వుండి వుంటుంది. ఆ సినిమాకు మీ ఆయన్ని కూడా తీసుకెళ్లారా అంటూ పవర్ పంచ్ వేశాడు నవీన్ పోలిశెట్టి.