గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By ఐవీఆర్
Last Updated : మంగళవారం, 16 మార్చి 2021 (22:43 IST)

నేను ఎవరో వదిలిన బాణాన్ని కాదు: షర్మిల రెడ్డి షాకింగ్ కామెంట్స్ (video)

వైఎస్ షర్మి ల రెడ్డి షాకింగ్ కామెంట్లు చేసారు. తెలంగాణలో స్థాపించబోయే పార్టీ గురించి కీలక ప్రకటన చేసారు. ఖమ్మం వేదికగా లక్ష మందితో సమరశంఖం పూరిస్తామని చెప్పుకొచ్చారు.
 
ఈ సందర్భంగా షర్మిల పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. తను ఎవరో వదిలిన బాణం కాదని అన్నారు. అలాగే భాజపా లేదా తెరాసకి బి టీంగా వుండాల్సిన పనిలేదన్నారు. షర్మలను ఖమ్మం నుంచి పోటీ చేయాల్సిందిగా పలువురు నాయకులు కోరారు.
 
కాగా తన సోదరుడు జగన్ మోహన్ రెడ్డి కోసం జరిపిన ఎన్నికల పర్యటనల్లో తను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకున్నారు. అలాంటిది ఇప్పుడు తెలంగాణలో తను ఎవరో వదిలిన బాణం కాదంటూ చెప్పడంతో వైసిపికి-షర్మిలకు మధ్య గ్యాప్ వున్నదా అనే అనుమానం కలుగుతోంది.