sharmila reddy, పాదయాత్ర చేస్తా, పార్టీ ఎప్పుడు పెడదాం?: షర్మల ప్రశ్న
సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ షర్మిల. అసలు తను పార్టీ పెట్టడం జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం ఇష్టం లేదన్నారు. మా అమ్మ విజయమ్మ పూర్తి మద్ధతు తనకు ఉంది. విభేదాలో, భిన్నాభిప్రాయాలో నాకు తెలియదు. నాకు పదవి ఎందుకు ఇవ్వలేదో జగన్‌ను వెళ్ళి అడగండి అంటూ మీడియాపై రుసరుసలాడారు షర్మిళ.
నా స్థానికతను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. విజయశాంతి, కెసిఆర్‌లు ఇక్కడివారా అంటూ ప్రశ్నించారు. పదునైన మాటలతో చిట్‌చాట్‌లో ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. విద్యార్థులో ముఖాముఖి తరువాత పిచ్చాపాటి మాట్లాడుతున్న మీడియా ప్రతినిధులతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు షర్మిళ.
నేను పుట్టి పెరిగింది హైదరాబాద్ లోనే.. నాపై విమర్సలు ఎందుకు చేస్తున్నారు అంటూ తనను టార్గెట్ చేసిన వారిని ప్రశ్నించారు షర్మిళ. అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ గడప గడపకూ పాదయాత్ర చేస్తూ వెళతానంటూ ప్రకటించారు షర్మళ. అంతేకాదు త్వరలోనే పార్టీ ప్రకటన ఉంటుందని స్పష్టం చేశారు. మే నెల, జూన్ నెలా అన్నది మీరే చెప్పండి అంటూ మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. షర్మిళ మాటలతో మీడియా ప్రతినిధులు అవాక్కయ్యారు.