శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By జె
Last Modified: శుక్రవారం, 2 అక్టోబరు 2020 (21:36 IST)

రోజాను హైపర్ ఆది అంత మాట అన్నాడా? ఏమన్నాడు?

హైపర్ ఆది స్కిట్ గురించి అస్సలు చెప్పనక్కర్లేదు. అతను ఏది మాట్లాడినా డబుల్ మీనింగ్ డైలాగ్‌లు. ఆ డైలాగ్‌లు బాగా పేలుతాయి. అభిమానులను బాగా ఉర్రూతలూగిస్తాయి. అయితే ఈమధ్య ఉన్నట్లుండి హైపర్ ఆది రోజా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
 
కొంతమంది పిల్లలు ఉన్నా అమ్మాయిగానే ఫీలవుతారు. అందులో మన రోజా గారు కూడా ఒకరు. ఇద్దరు పిల్లలున్నారు. అయినా ఆమె ఇప్పటికీ అమ్మాయే అంటూ హైపర్ ఆది పంచ్‌లు వేశాడు. ఇది కాస్త జబర్దస్త్‌లో పెద్ద చర్చే నడిచింది.
 
మృదు స్వభావి అయిన రోజా ఆ విషయాన్ని చాలా లైట్‌గా తీసుకుని నవ్వుకున్నారు. హైపర్ ఆది డైలాగ్‌లను పొగడ్తలతో ముంచెత్తారు. నా బాధ్యత నాకు బాగా తెలుసు. నన్ను అమ్మ నుంచి అమ్మాయి చేసినందుకు ధన్యవాదాలు ఆది అంటూ రోజా అన్నారు.