న్యాయ వ్యవస్థకు చేతులెత్తి మొక్కుతున్నా... రోజా

roja
శ్రీ| Last Updated: శనివారం, 19 సెప్టెంబరు 2020 (22:49 IST)
అమరావతిలో జరిగిన అవినీతిపై ఏసీబీ రిపోర్టుపై ఒక లాయర్ కేసు నమోదు చేస్తే హైకోర్టు గ్యాగ్ నోటీస్ ఇవ్వటం అనేది దేశంలోనే పెద్ద చర్చనీయాంశమైందని వైసీపీ ఎమ్మెల్యే రోజా విస్మయం వ్యక్తం చేశారు. ప్రత్యేక పరిస్థితుల్లో లేదా అత్యవసరమైన పరిస్థితిలో మాత్రమే గ్యాగ్ ఇస్తారు కానీ, ఒక అవినీతి మీద ఈవిధంగా గ్యాగ్ ఇవ్వడాన్ని న్యాయస్థానాలు ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

దేశంలో పలు రాష్ట్రాల్లో ఏసీబీ కేసులు ఉన్నాయి. సిబిఐ కేసులు ఉన్నాయి. కానీ గ్యాగ్ నోటీస్ ఎక్కడా లేదని, అది కూడా ఒక అవినీతి కేసు మీద ఇచ్చారు అంటే ప్రజలు ఆలోచించాలి అన్నారు. చంద్రబాబు నాయుడు పోలవరాన్ని అమరావతిని ఏటీఎంల వాడుకుంటున్నాడు అని దేశ ప్రధాని అన్న తర్వాత కూడా చంద్రబాబు మీద సిబిఐ ఎంక్వైరీ వేయకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

చంద్రబాబు నాయుడికి దమ్ము, ధైర్యం ఉంటే నారా లోకేష్ ఫైబర్ గ్రిడ్ పైన ఎదుర్కొంటున్న ఆరోపణలకు, తన సామాజికవర్గం చేసిన 4 వేల ఎకరాల భూమి దోచుకున్న అమరావతి రియల్ ఎస్టేట్ దందాపై సిబిఐకి అప్పగించాలని కోరాలని సవాల్ విసిరారు రోజా.

గతంలో తన కుమారుడు జగన్ మోహన్ రెడ్డిపై ఆరోపణలు వచ్చినపుడు ధైర్యంగా సిబిఐ విచారణ చేపట్టాలని నేరం రుజువైతే ఉరి తీయండి అని కోరిన మాజీ దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి అని, చంద్రబాబుకు ఆ ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కోర్టులు కన్ను తెరిచి సామాన్యుడైనా, పేదవాడైన, పెద్దవాడైన చంద్రబాబు అయినా కోర్టు ముందు అందరూ సుమానమని, అందువలన అవినీతికి సపోర్టుగా గ్యాగ్ ఆర్డర్ ఇవ్వకుండా ఉండాలని న్యాయ వ్యవస్థకు చేతులేత్తి నమస్కరించారు రోజా.దీనిపై మరింత చదవండి :