బుధవారం, 11 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 ఆగస్టు 2024 (15:48 IST)

అడ్వర్టైజ్‌మెంట్‌ వివాదంలో సుమక్క... లబోదిబోమంటున్న ఇన్వెస్టర్లు

Suma Kanakala
స్టార్‌ యాంకర్‌ సుమ కనకాల వివాదంలో చిక్కారు. ఆమె చేసిన అడ్వర్టైజ్‌మెంట్‌ వివాదంలోకి నెట్టేసింది. అడ్వర్టైజ్‌మెంట్‌ చేయించుకున్న సంస్థ బోర్డు తిప్పేయడంతో పెట్టుబడిదారులు లబోదిబోమంటున్నారు. 
 
యాంకర్‌ సుమ చెప్పడంతోనే తాము పెట్టుబడులు పెట్టామని.. సుమ తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్‌ చేస్తుండడం కలకలం రేపింది. సుమక్క చెప్పడంతోనే తాము ప్లాట్లు కొన్నామని.. ఇప్పుడు తీవ్రంగా నష్టపోయామని బాధితులు వాపోతున్నారు. రాకీ అవెన్యూస్ అనే రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు ఆమె ప్రచారం చేశారు.
 
అయితే ఆ సంస్థ తాజాగా బోర్డు తిప్పేసింది. తక్కువ ధరకు ప్లాట్లు ఇస్తామని ప్రచారం చేయడం, పెద్ద ఎత్తున స్పందన రావడంతో దాదాపు రూ.88 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. అయితే డబ్బులు తీసుకున్న సంస్థ ఇప్పుడు బోర్డు తిప్పేసింది.
 
తమకు న్యాయం చేయాలంటూ పోలీసులతో పాటు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ క్రమంలో సంస్థకు ప్రచారం చేసిన సుమ కూడా స్పందించాలని కోరుతున్నారు.