మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: సోమవారం, 16 మార్చి 2020 (17:20 IST)

ఏంటీ.. ఈ కుర్రోడు సుమ కొడుకా? నెటిజన్స్ ఆశ్చర్యం

యాంకర్ సుమ. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆమె హోస్టుగా ప్రోగ్రామ్ చేయాలని డిసైడ్ అయ్యేవారు టాలీవుడ్ ఇండస్ట్రీలో 100 పర్సెంట్ వుంటారంటే అతిశయోక్తి కాదు. ఇప్పుడామె షేర్ చేసిన ఓ ఫోటో వైరల్ అయ్యింది. ఆ ఫోటోలో తనతో వున్న కుర్రోడు తన కుమారుడు అని చెప్పడంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
 
అతడు బాగా ఎదిగిపోయి హ్యాండ్‌సమ్‌గా వుండటం, సుమ కూడా ఎప్పటినుంచి తన ఫిట్నెస్ ను కాపాడుకుంటూ వుండటంతో అతడు ఆమెకి తమ్ముడేమోనంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇదంతా యాంకర్ సుమ ఆరోగ్యం పట్ల తీసుకున్న శ్రద్ధను తెలుపుతుంది. 
 
వయసు మీద పడుతున్నా, ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు హుషారుగా వుండే సుమ తన కుమారుడు రోషన్ పుట్టిన రోజు సందర్భంగా తీసుకున్న ఫోటోను ఇలా షేర్ చేశారు. కాగా 1999లో సుమకు రాజీవ్ కనకాలతో పెళ్లయింది.