పండంటి కవల పిల్లలకు జన్మనిచ్చిన యాంకర్ ఉదయభాను
బుల్లితెర యాంకర్‌గా తెలుగు సినీ ప్రియులకు సుపరిచితమైన ఉదయభాను ఇద్దరు కవలపిల్లలకు జన్మనిచ్చింది. శనివారం రాత్రి బంజారాహిల్స్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఉదయభాను ఒక బాబు, ఒక పాపకు జన్మనిచ్చింది.
బుల్లితెర యాంకర్‌గా తెలుగు సినీ ప్రియులకు సుపరిచితమైన ఉదయభాను ఇద్దరు కవలపిల్లలకు జన్మనిచ్చింది. శనివారం రాత్రి బంజారాహిల్స్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఉదయభాను ఒక బాబు, ఒక పాపకు జన్మనిచ్చింది.
ఇద్దరు పిల్లలు, తల్లి ఆరోగ్యంగా ఉన్నారని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. యాంకర్‌గా ఒకప్పుడు బుల్లితెరను ఏలిన ఉదయభాను కొద్దికాలంగా తెరకు దూరంగా ఉన్నారు. విజయవాడకు చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకొని స్థిరపడిన ఉదయభాను ఇన్నాళ్లకు మళ్లీ వార్తొల్లోకొచ్చింది.