1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 27 జూన్ 2024 (18:54 IST)

రామోజీరావు సంస్మరణ సభ- రాజమౌళి-బాబు-పవన్- కీరవాణి టాక్ (వీడియో)

Babu-Rajamouli_Pawan
Babu-Rajamouli_Pawan
విజయవాడలో జరుగుతున్న రామోజీరావు సంస్మరణ సభకు ప్రముఖ దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను వీరు మర్యాదపూర్వకంగా కలిసి కాసేపు ముచ్చటించారు. 
 
ఈ సందర్భంగా రాజమౌళి గురించి కీరవాణితో చంద్రబాబు ఏదో చెప్తూ కనిపించారు. ఆపై రాజమౌళి కూడా చంద్రబాబు చెవిలో ఏదో చెప్పారు. ఆపై సంగీత దర్శకుడు కీరవాణి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను పలకరించారు. 
 
ఏపీ ప్రభుత్వం రామోజీ సంస్మరణ సభను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తోంది. ఈ సభకు రాజకీయ, సినీ, పాత్రికేయ రంగాల వారు విచ్చేశారు. ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్, విజయవాడ ఎమ్మెల్యే సుజనా చౌదరి, సినీ నిర్మాతలు అశ్వినీదత్, ఆదిశేషగిరిరావు, దగ్గుబాటి సురేశ్, శ్యాంప్రసాద్ రెడ్డి, సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు, దర్శకుడు బోయపాటి శ్రీను తదితరులు హాజరయ్యారు.