మంగళవారం, 7 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By srinivas
Last Updated : మంగళవారం, 17 ఏప్రియల్ 2018 (14:22 IST)

ఎఫ్ 2 సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు..?

'ప‌టాస్' సినిమాతో ద‌ర్శ‌కుడిగా కెరీర్ ప్రారంభించి.. తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యం సాధించి.. ఆ త‌ర్వాత 'సుప్రీమ్', 'రాజా ది గ్రేట్' చిత్రాల‌తో హ్యాట్రిక్ సాధించిన యువ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి.

'ప‌టాస్' సినిమాతో ద‌ర్శ‌కుడిగా కెరీర్ ప్రారంభించి.. తొలి ప్ర‌య‌త్నంలోనే విజ‌యం సాధించి.. ఆ త‌ర్వాత 'సుప్రీమ్', 'రాజా ది గ్రేట్' చిత్రాల‌తో హ్యాట్రిక్ సాధించిన యువ ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి. ఈ సినిమా త‌ర్వాత "ఎఫ్ 2" అనే సినిమా చేయ‌నున్న‌ట్టు ఎనౌన్స్ చేసాడు. ఈ మూవీని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ పై దిల్ రాజు నిర్మించ‌నున్నారు. ఇంత‌కీ... "ఎఫ్ 2" అంటే ఏమిట‌నుకుంటున్నారా..? ఫ‌న్ - ఫ్రస్ట్రేషన్  అట‌.
 
ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఈ సినిమాలో త‌మ‌న్నా, మెహ‌రీన్ న‌టిస్తున్నారు. ఈ మూవీ జూన్ నుంచి సెట్స్‌పైకి వెళ్ల‌నుంద‌ని దర్శకుడు అనిల్ రావిపూడి ట్విట్ట‌ర్ ద్వారా తెలియచేశాడు. ఈ సంద‌ర్భంగా వెంక‌టేష్, వ‌రుణ్ తేజ్, దిల్ రాజుల‌తో తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేసాడు. ఫుల్ లెంగ్త్ ఎంట‌ర్ టైన‌ర్‌గా రూపొందే ఈ సినిమాలో న‌టించ‌డం చాలా సంతోషంగా ఉందని వ‌రుణ్ తేజ్ చెప్పుకొచ్చాడు.
 
'దిల్ రాజు' బ్యాన‌ర్‍లో అనిల్ రావిపూడికి ఇది మూడో చిత్రం. అనిల్ రావిపూడి సినిమా అంటే... ఎంట‌ర్ టైన్మెంట్ ఏరేంజ్‌లో ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. దీనికి తోడు "ఫ‌న్ - ఫ్రస్ట్రేషన్ " అనే టైటిల్ కావ‌డంతో ఇందులో ఎంట‌ర్టైన్మెంట్ ఫుల్లుగా ఉంటుంద‌ని తెలుస్తోంది. మ‌రి.. వ‌రుస విజ‌యాలు సాధిస్తోన్న అనిల్ రావిపూడి ఈ సినిమాతో కూడా విజ‌యం సాధిస్తాడ‌ని ఆశిద్దాం.