అందుకే అన్నీ విప్పి చూపిస్తున్నా... ముద్దులు పెడుతున్నా : అనూ ఇమ్మాన్యుయేల్
మాలీవుడ్ నుంచి టాలీవుడ్‌కు దిగుమతి అయిన హీరోయిన్లలో అనూ ఇమ్మాన్యుయేల్ ఒకరు. ఇటీవలి కాలంలో ఆమె స్కిన్ షోలో రెచ్చిపోతోంది. దీనిపై ఆమె స్పందిస్తూ, కమర్షియల్ సినిమాకు గ్లామర్ హంగు ఉండాలన్నది ఓ సూత్రం. కాబట్టి కథ డిమాండ్ మేరకు స్కిన్ షో, లిప్‌లాక్ తప్పనిసరి. మీరు బాగా గమనిస్తే కావాలని ఇరికించినట్టు ఎక్కడా అనిపించవు అని చెప్పుకొచ్చింది.
చాలా ఫీలయ్యా. 'గీత గోవిందం'లో కథానాయికగా ఫస్ట్ చాయిస్ నేనే. కానీ అదే సమయంలో 'నా పేరు సూర్య' సినిమా చెయ్యడం వల్ల డేట్స్ క్లాష్ అయ్యాయి. అందుకే ఆ సినిమా చెయ్యలేకపోయా. కానీ దర్శకుడు పరశురామ్ అతిథి పాత్ర ఇచ్చారు. అదైనా దక్కినందుకు ఆనందంగా ఉంది. ఫైనల్‌గా చూస్తే 'గీత గోవిందం' పాత్ర మిస్ అవ్వడం చాలా బాధగా ఉందని చెప్పుకొచ్చారు.
సక్సెస్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం కష్టమే. సినిమా ఫెయిల్ అయినంత మాత్రాన అందులో నటీనటులు, వారి నటన ఫెయిల్ అయిందనుకోకూడదు. వాటిలో నా నటన నచ్చబట్టే స్టార్‌ల పక్కన అవకాశాలు వచ్చాయని నేననుకుంటున్నా. చేసిన పాత్ర పండినా సినిమాకు టాక్ బాగోకపోతే సంతృప్తి ఉండదు. అది నాకూ ఉంది. కష్టాల నుంచే సక్సెస్ మొదలవుతుందని భావిస్తున్నా. అపజయం నేర్పించే పాఠం ఎప్పటికీ మరచిపోలేమని చెప్పుకొచ్చింది.
ఒక సినిమాకు సైన్ చెయ్యాలంటే ఒక్క ఎలిమెంట్‌ని బేస్ చేసుకోకూడదు. సినిమాకు కథ ఎంత ముఖ్యమో.. హీరో, డైరెక్టర్, బ్యానర్ అన్నీ పక్కాగా కుదిరితేనే అది మంచి సినిమా కాగలదు. 'అజ్ఞాతవాసి' అంగీకరించడానికి కారణం స్టార్ హీరో, పవన్ కళ్యాణ్ ఉన్నారనో, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఉన్నారనో చెప్పొచ్చు. కానీ నేను వారితోపాటు కథ గురించి ఆలోచించి ఓకే చేశా. 'అత్తారింటికి దారేది'లోని హీరోయిన్ ప్రణీత తరహా పాత్ర అయితే నేను చెయ్యనని ముందే చెప్పేశా. అలా ఉండదని త్రివిక్రమ్ మాటిచ్చారు. ఆ సినిమా సరిగ్గా ఆడలేదేమో కానీ నాకు కీర్తీసురేశ్‌కూ మంచి పేరే వచ్చిందని చెప్పుకొచ్చింది.