శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : ఆదివారం, 28 అక్టోబరు 2018 (10:44 IST)

టాలీవుడ్ హీరోతో డేటింగ్ చేస్తున్న హీరోయిన్ అనుపమ

టాలీవుడ్ హీరోయిన్లలో ఒకరు అనుపమ పరేశ్వరన్. ఈ మలయాళ కుట్టి మంచి అవకాశాలతో దూసుకెళుతోంది. ఈమె ఓ హీరోతో డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. 
 
ఇంతకు ఈ హీరో ఎవరో కాదు.. రామ్. సాధారణంగా ఎక్కువ సినిమాల్లో ఒక హీరోతో కలిసి నటిస్తే ఆటోమేటిక్‌గా ప్రేమ స్టార్ట్ అవుతుందందనే పుకార్లు రావడం సహజమే. ఇప్పుడు అలాంటిదే జరిగింది. 
 
తనతో పాటు కొన్ని సినిమాల్లో కలిసి నటించి, హీరోయిన్‌గా తనను పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు సహకరించిన రామ్‌తో అనుపమ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతోందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఇదే తెలుగు సినీపరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారిపోయింది. 
 
'ఉన్నదొక్కటే జిందగీ' సినిమాలో రామ్, అనుపమ మధ్య ప్రేమ చిగురించిందనీ, 'హలో గురూ ప్రేమ కోసమే' సినిమాతో బలపడిందని చెప్పుకుంటున్నారు. అంతేకాదు ప్రస్తుతం హలో గురూ ప్రేమ కోసమే సినిమా సక్సెస్ కావడంతో ఈ ఇద్దరూ హీరోహీరోయిన్లు టూర్‍‌లో ఉన్నారు. 
 
పైగా, వీరిద్దరూ ఫోన్లలో మాట్లాడుకోవడం, వాట్సాప్ చాటింగ్స్, చేసేసుకుంటున్నారట. దీనిపై వారిని కదిలిస్తే... ఏం ఫోన్లలో మీరు మాట్లాడుకోరా... చాటింగులు చేసుకోరా అంటూ రివర్స్ ప్రశ్నలు వేస్తున్నారట.