బుధవారం, 1 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. మనస్తత్వ శాస్త్రం
Written By
Last Updated : శుక్రవారం, 26 అక్టోబరు 2018 (18:17 IST)

ఆమె ఓ విడో... నేను ఓ లెక్చరర్.. ఆమెను ప్రేమిస్తున్నా.. తప్పా?

తాను ఓ ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నాను. మా వీధిలో ఓ అందమైన అమ్మాయి ఉండేది. వారిది బాగా సంపన్నమైన కుటుంబం. అయితే, యేడాది క్రితం ఆ యువతికి పెళ్లి చేయగా, రోడ్డు ప్రమాదంలో ఆమె భర్త ప్రాణాలు కోల్పోయాడు. అప్పటి నుంచి ఆమె పుట్టింట్లోనే ఉంటుంది. తల్లిదండ్రులకు తానొక్కతే కూతురు. అన్నాదమ్ములు కూడా లేరు. వాళ్లు ఆమెను గుండెలో పెట్టుకుని చూసుకుంటున్నారు. 
 
అయితే, ఒకప్పుడు ఎంతో వెలిగిపోయిన ఆ ముఖం ఇప్పుడు వాడి వసివాడుతోంది. పుట్టింట్లో ఉన్నా పరాయిలాగే ఉంటోంది. ఇప్పుడు నాలో ఆమె ఒక సంపన్నురాలన్న భావన లేదు. విడో కదా అన్న సానుభూతీ లేదు. ఒకప్పుడు ఆమె పట్ల నాలో ఉన్న ఇష్టం ఇప్పుడు ప్రేమగా మారింది. ఈ విషయాన్ని ఆమె ముందు ప్రస్థావించాలని నా మనసు ఉవ్విళ్లూరుతోంది. ఏం చేయమంటారో మీరే చెప్పండి.
 
ప్రేమకు విధవరాలా.. సంపన్నురాలా అన్నది ఇక్కడ ప్రశ్నకాదు. కానీ, ఆమె పట్ల ప్రేమ ఉందా లేదా అన్నదే ఇక్కడ ముఖ్యం. పైగా, ఆమెపై మీకు ఉండేది నిజమైన ప్రేమ అయితే మనసులోని మాటను వెల్లడించడంలో ఎలాంటి తప్పులేదు. ఆ ప్రతిపాదనకు ఆమె నో చెబుతుందా లేదా ఓకే అంటుందా అన్నది వేరే విషయం. ఒకవేళ ఆమె నో అన్నా నేనేమీ బాధపడను... అన్నారుగా ఇంకా మీమాంస ఎందుకు? నెగెటివ్‌గా అనుకునే వాళ్లు అనుకుంటూనే ఉంటారు. అందువల్ల మీ మనసులోని మాటను ఆమెకు స్పష్టంగానే చెప్పండి. ఇందులో ఎలాంటి తప్పులేదు.