శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శనివారం, 27 అక్టోబరు 2018 (14:59 IST)

టాలీవుడ్‌ను తాకిన మీ టూ? సమంత ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు?

టాలీవుడ్‌ను మీ టూ సెగ తాకనుందా.. అంటే అవుననే సంకేతాలు వస్తున్నాయి. దేశ వ్యాప్తంగా మీ టూ ఉద్యమం సాగుతున్న నేపథ్యంలో.. అలర్ట్ అయిన టాలీవుడ్ ఇండస్ట్రీ కమిటీ ఏర్పాటు చేసుకుంది.


హీరోయిన్ సమంత ఆధ్వర్యంలో స్టార్ యాంకర్లు సుమ కనకాల, ఝాన్సీలతో పాటు మహిళా దర్శకురాలు నందినిరెడ్డి ఈ కమిటీకి పెద్దలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కన్నడనాట ఈ మీటూ ప్రకంపనలు రోజురోజుకి ఎక్కువవుతున్నాయి. దీంతో ఇప్పటికే క్యాస్టింగ్ కౌచ్ వివాదంతో దేశ వ్యాప్తంగా వివాదం సృష్టించడంతో టాలీవుడ్ మీ టూతో కాస్త అప్రమత్తమైంది. 
 
ఇందులో భాగంగా ఏర్పాటైన కమిటీ ఇటీవల సమావేశమైంది. ఇండస్ట్రీలో నటీమణులు, మహిళా టెక్నీషియన్లు ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి ఈ కమిటీలో బయటపెడితే వారి సమస్యలను పరిష్కరిస్తుంది. ఇప్పటికే ఈ కమిటీకి కొందరు నిర్మాతలు, హీరోలపై లైంగిక ఆరోపణలకు సంబంధించిన ఫిర్యాదులు అందినట్లు సమాచారం. 
 
ముఖ్యంగా టాలీవుడ్‌కి చెందిన నలుగురు నిర్మాతలు, ఇద్దరు మిడిల్ రేంజ్ హీరోలపై ఈ ఆరోపణలు ఎక్కువగా వినిపిస్తున్నాయట. ఈ వివాదాలను పరిష్కరించడానికి అల్లు అరవింద్, జెమినీ కిరణ్, తమ్మారెడ్డి భరద్వాజ రంగంలోకి దిగుతున్నట్లు సమాచారం. ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు కూడా వుండటంతో.. టాలీవుడ్ పెద్దలు సైలెంట్‌గా డీల్ చేస్తున్నట్లు ఫిలిమ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.