బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 22 నవంబరు 2021 (19:32 IST)

నటి మాధవి కన్నుమూత.. కరోనాతో తిరిగి రానిలోకాలకు...

Madhavi
ప్రముఖ మరాఠీ నటి మాధవీ ఆదివారం కన్నుమూశారు. ఆమె కరోనా కారణంగా కన్నుమూశారు. ఆమె ముంబైలోని సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం చేరారు.  చివరికి చికిత్స ఫలించక కన్నుమూశారు. ఈ సీరియల్‌లో తల్లి పాత్రలో నటించింది. ఇంతలో, టీవీ నటి నీలు కోహ్లీ మాధవీ మరణం పట్ల సంతాపం వ్యక్తం చేశారు.  
 
అశోక్ సరాఫ్ సరసన మరాఠీ చిత్రం ఘన్ చక్కర్‌లో ఆమె చేసిన పాత్రకు మంచి గుర్తింపు మరియు ప్రశంసలు అందుకున్నారు. ఇటీవల తుజా మాజా జంటాయ్‌తో మరాఠీ టీవీ అరంగేట్రం చేసింది. 
 
ఐసా కభీ సోచా నా థా, కహిన్ తో హోగా, కోయి అప్నా సా, ఇతరులతో సహా అనేక హిందీ టీవీ షోలలో మాధవి నటించినందుకు ఆమె అభిమానుల్లో మంచి ప్రాచుర్యం పొందింది. ఇకపోతే.. మాధవి మృతి పట్ల సినీ ప్రముఖులు, బుల్లితెర నటులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.