గురువారం, 19 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 16 నవంబరు 2021 (12:48 IST)

తమిళ్ స్టార్ హీరో విజయ్ ఇంట్లో బాంబు కలకలం

తమిళ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనదైన నటనతో తమిళ ప్రేక్షకులతో పాటు… తెలుగులోనూ మంచి పేరు సంపాదించుకున్నారు హీరో విజయ్. సినిమాలతో పాటు సామాజిక కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటారు హీరో విజయ్. అయితే తాజాగా హీరో విజయ్ ఇంట్లో బాంబు అనే వార్త కలకలం రేపుతోంది.
 
విజయ్ ఇంట్లో బాంబు పెట్టినట్లు చెన్నై నగర పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో శనివారం అర్ధరాత్రి నీలంగారైల్లోని… ఆయన ఇంట్లో పాలు నిర్వహించారు పోలీసులు. నీలంగారై పోలీసులు బాంబు స్క్వాడ్ కలిసి తనిఖీ చేశారు. 
 
అయితే ఈ తనిఖీల్లో బాంబు ఎక్కడ దొరకలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విచారణలో విల్లుపురం జిల్లా.. మరక్కణం గ్రామానికి చెందిన భువనేశ్వర్ అనే మతిస్థిమితం లేని యువకుడు పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసినట్లు తెలిసింది. అతను గతంలో కూడా పలువురు రాజకీయ అలాగే సినీప్రముఖుల ఇళ్లలో బాంబు ఉన్నట్లు పోలీసులకు ఫోన్ చేశాడని విచారణలో తేలింది.