శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 7 ఆగస్టు 2019 (21:22 IST)

అనుష్క‌ నిశ్శ‌బ్ధం అప్పుడే పూర్తైందా..? ఇంత‌కీ.. రిలీజ్ ఎప్పుడు..?

అనుష్క న‌టిస్తున్న తాజా చిత్రం నిశ్శ‌బ్ధం. అనుష్క, ఆర్.మాధ‌వ‌న్, అంజ‌లి, మైఖేల్ మ్యాడ‌స‌న్, షాలిని పాండే ప్ర‌ధాన తారాగ‌ణంగా రూపొందుతోన్న ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీ నిశ్శ‌బ్ధం చిత్రానికి హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, కోన ఫిల్మ్ కార్పోరేష‌న్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
 
అనుష్క ఇటీవ‌ల న‌టిగా 14 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుని 15వ సంవ‌త్స‌రంలోకి అడుగుపెట్టిన సంద‌ర్భంగా రిలీజ్ చేసిన నిశ్శ‌బ్ధం టైటిల్ పోస్ట‌ర్ కి ట్రెమండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. సీయోట్ లో షూటింగ్ జ‌రుపుకున్న‌ ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్ ట్విట్ట‌ర్లో స్పందిస్తూ...నిశ్శ‌బ్ధం షూటింగ్ పూర్తైంది. 
 
ఈ థ్రిల్ల‌ర్ మూవీని అంద‌రికీ ఎప్పుడెప్పుడు చూపిస్తామా అని ఆస‌క్తితో ఎదురు చూస్తున్నాను అని నిశ్శ‌బ్ధం టీమ్ తో ఉన్న ఫోటోను పోస్ట్ చేసారు. ఈ చిత్ర నిర్మాత‌లు టి.జి.విశ్వ‌ప్ర‌సాద్, వివేక్ కూచిభోట్ల‌, కోన వెంక‌ట్ ఈ మూవీని తెలుగు, త‌మిళ్, ఇంగ్లీషు, హిందీ & మ‌ల‌యాళం ఈ 5 భాష‌ల్లో ఈ సంవ‌త్స‌రం చివ‌రిలో భారీ స్ధాయిలో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి...ఈ నిశ్శ‌బ్ధం అనుష్క‌కి మ‌రో విజ‌యాన్ని అందిస్తుందో లేదో చూడాలి.