అనుష్క నిశ్శబ్ధం ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ఫిక్స్.!
అనుష్క తాజా చిత్రం నిశ్శబ్ధం. మాధవన్‌తో కలిసి నటిస్తున్న ఈ చిత్రంలో దాదాపు 100కి పైగా సినిమాల్లో నటించిన కిల్ బిల్ ఫేమ్ మైఖేల్ మ్యాడసన్ తొలిసారి ఈ ఇండియన్ మూవీలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో నిర్మిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. టాలీవుడ్, కోలీవుడ్, హాలీవుడ్ నటీనటులతో రూపొందుతోన్న ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ మూవీ లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... అనుష్క జులై 21కి సినిమా రంగంలో ప్రవేశించి 14 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా నిశ్శబ్ధం ఫస్ట్ లుక్ & టైటిల్ రిలీజ్ చేయాలనుకుంటున్నారట. ఈ విషయాన్ని డైరెక్టర్ హేమంత్ మధుకర్ ట్విట్టర్ ద్వారా తెలియచేసారు. తెలుగులో నిశ్శబ్ధం టైటిల్‌తో రూపొందుతోన్న ఈ మూవీని హాలీవుడ్‌లో సైలెన్స్ అనే టైటిల్‌తో రిలీజ్ చేయనున్నారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టి.జి.విశ్వప్రసాద్ నిర్మిస్తోన్న ఈ ఇంటర్నేషనల్ మూవీలో హాలీవుడ్ స్టార్ మైఖేల్ మ్యాడసన్, బాహుబలి ఫేమ్ సౌతిండియా లేడీ సూపర్ స్టార్ అనుష్క, పాన్ ఇండియా స్టార్ ఆర్.మాధవన్‌లతో పాటు సుబ్బరాజు, అంజలి, షాలిని పాండే, అవసరాల శ్రీనివాస్ తదితరులు నటిస్తున్నారు.