ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 డిశెంబరు 2023 (16:39 IST)

మేకప్ ఆర్టిస్టును పెళ్లాడనున్న సల్మాన్ ఖాన్ తమ్ముడు

Arbaaz Khan
Arbaaz Khan
ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ మేకప్ ఆర్టిస్టు షురా ఖాన్ పెళ్లిపీటలెక్కుతున్నారు. అర్బాజ్ ఖాన్‌కి ఇది రెండో పెళ్లి. 
 
డిసెంబర్ 24న వీరి వివాహం అట్టహాసంగా జరుగనుంది. 1998లో నటి మలైకా అరోరాను పెళ్లాడిన అర్బాజ్ 19 సంవత్సరాల వైవాహిక జీవితానికి బ్రేకప్ చెప్పి 2017లో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. 
 
మలైకాతో విడిపోయిన తర్వాత అర్బాజ్ తనకంటే చాలా చిన్నదైన నటి, మోడల్ జార్జియా ఆండ్రియాతో ప్రేమాయణం సాగించి.. ఆపై బ్రేకప్‌తో విడిపోయారు. తాజాగా మేకప్ ఆర్టిస్టు షురా ఖాన్‌ను పెళ్లాడనున్నారు.