బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 11 డిశెంబరు 2023 (12:43 IST)

జైలర్ కమెడియన్‌కు బుల్లితెర నటితో డుం డుం డుం

Reddin Kingsley
Reddin Kingsley
తమిళ సినీ హాస్యనటుడు రెడిన్ కింగ్స్లీ వివాహం చేసుకున్నారు. వధువు సినిమా సీరియల్ నటి, మోడల్ అయిన సంగీత. 46 ఏళ్ల వయసులో రెడ్ పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకకు దగ్గరి బంధువులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. 
 
రెడిన్ కెరీర్ డ్యాన్స్‌తో ప్రారంభమైంది. రెడిన్ చెన్నై, బెంగళూరులలో ప్రభుత్వ ప్రదర్శనలకు ఈవెంట్ ఆర్గనైజర్. నెల్సన్ దిలీప్ కుమార్ చిత్రాలలో రెగ్యులర్‌గా కనిపించేవాడు. రెడిన్ శివకార్తికేయన్ నటించిన డాక్టర్ చిత్రంతో బాగా పాపులర్ అయ్యాడు.
 
కొలమావు కోకిల సినిమాతో నటుడిగా అరంగేట్రం చేసిన ఆయన... మృగం, అన్నతే, కథువకుల్లా రెండు కాదల్, జైలర్, ఎల్‌కెజి, గూర్ఖా, మార్క్ ఆంటోని వంటి చిత్రాలలో ఆయన నటించారు. కామెడీ సన్నివేశాల్లో రెడ్ ఆకట్టుకునే నటన, డైలాగ్ డెలివరీలో వైవిధ్యం ప్రేక్షకులను ఆకట్టుకుంది.