బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 డిశెంబరు 2023 (16:41 IST)

శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్‌కు పెళ్లి?

Janhvi Kapoor
శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ త్వరలో పెళ్లి కూతురు  కాబోతున్నట్లు మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చైల్డ్ హుడ్ బాయ్ ఫ్రెండ్‌ శిఖర్ పహారియాతో ప్రేమలో వున్న జాన్వీ కపూర్.. త్వరలో అతనితో వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. 
 
ఇందుకు ఇరు కుటుంబాలు ఓకే చెప్పాయని.. త్వరలోనే వీరిద్దరి పెళ్లి జరుగనుందని బిటౌన్ కోడై కూస్తోంది. అన్నీ అనుకున్నట్లే జరిగితే.. వచ్చే ఏడాదే జాన్వీ, శిఖర్ పెళ్లి జరగడం ఖాయమని తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే వేచి చూడాలి.