శుక్రవారం, 23 ఫిబ్రవరి 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 6 డిశెంబరు 2023 (20:02 IST)

మహిళ ఆత్మహత్య కేసు-పుష్ప ఫ్రెండ్ కేశవ అరెస్ట్

Pushpa
Pushpa
"పుష్ప" నటుడు జగదీశ్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక మహిళ మరో వ్యక్తితో ఉన్నప్పుడు తీసిన ఫొటోను సోషల్ మీడియాలో పెడతానంటూ ఆమెను జగదీశ్ బ్లాక్ మెయిల్ చేయగా.. ఆ వేధింపులు తట్టుకోలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. 
 
ఈ కేసులో పోలీసులు విచారణ జరుపుతున్నారు. దీంతో పోలీసులు జగదీశ్‌పై కేసు నమోదు చేసి.. అతని కోసం గాలిస్తున్నారు. కానీ జగదీశ్ పోలీసుల నుంచి తప్పించుకొని తిరుగుతున్నాడు. 
 
అయితే పంజాగుట్ట పోలీసులు అతడిని బుధవారం పట్టుకున్నారు. అరెస్ట్ చేసిన తరువాత అతడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. జగదీశ్ తన సినిమా పాత్ర కేశవ పేరుతో ఫేమస్ అయ్యాడు. ప్రస్తుతం పుష్ప -2 సినిమాలో కూడా నటిస్తున్నాడు.