అంతర్జాతీయ బాస్కెట్ బాల్ పోటీల్లో రాణిస్తున్న టాలీవుడ్ హీరో
తెలుగు యువ హీరో అరవింద్ కృష్ణ బాస్కెట్ బాల్ ప్లేయర్ అయ్యాడు. అంతర్జాతీయ బాస్కెట్ బాల్ పోటీల్లో రాణిస్తున్నాడు. తెలుగు చిత్రసీమలో హీరోగా తనదైన గుర్తింపు సొంతం చేసుకున్న అరవింద్ కృష్ణ, మరోవైపు ఆటల్లో కూడా రాణిస్తున్నారు.
ఇండియా నుంచి ఫిబా ఈ చాంపియన్ లీగ్ పోటీల్లో పాల్గొన్న ఏకైక ఆటగాడు మన తెలుగు హీరో అరవింద్ కృష్ణ కావటం విశేషం. ప్రస్తుతం ఓ సూపర్ హీరో మూవీలో నటిస్తున్న ఆయన... మరో వైపు బాస్కెట్ బాల్ టోర్నమెంట్లలో కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు.
ఈ సందర్భంగా "క్రికెట్‌లో పొట్టి క్రికెట్ ఐపీఎల్ తరహాలో బాస్కెట్ బాల్‌లో 3BL లీగ్‌ను నిర్వహిస్తున్నారు. నేను వరుస సినిమాలతో బిజీగా ఉన్నాను. ఈ నేపథ్యంలో 3BL లీగ్‌లో పాల్గొనటం నాకు మంచి బ్రేక్ అనొచ్చు. ఇది ఎంతో ఎనర్జీనిస్తుంది" అని అరవింద్ కృష్ణ పేర్కొన్నారు. ప్రొఫెషనల్ బాస్కెట్ బాల్ ప్లేయర్ అయిన అరవింద్ ఓ వైపు సినిమాలు, మరోవైపు స్పోర్ట్స్‌ని బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నారు