యువకులకు షారూక్ ఖాన్ బంపర్ ఆఫర్.. కుమార్తెతో డేటింగ్ చేయొచ్చు.. కానీ!
బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ యువకులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తన ముద్దులు కుమార్తె సుహానాతో డేటింగ్ చేయాలని భావించే కుర్రాడు విధిగా తన కండీషన్లను అంగీకరించి తీరాల్సిందేనంటూ ప్రకటించారు.
బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ యువకులకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తన ముద్దులు కుమార్తె సుహానాతో డేటింగ్ చేయాలని భావించే కుర్రాడు విధిగా తన కండీషన్లను అంగీకరించి తీరాల్సిందేనంటూ ప్రకటించారు. లేకపోతే.. తన విశ్వరూపం చూడాల్సి ఉంటుందని హెచ్చరించాడు. తాజాగా ‘ఫెమీనా’ నిర్వహించిన ఇంటర్వ్యూలో షారూక్ ఖాన్ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
ముఖ్యంగా, తన కూతురు సుహానాతో డేటింగ్ చేసే కుర్రాడు కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలన్నాడు. అవి ఏమిటంటే.. ‘ఉద్యోగం చేస్తూ ఉండాలి, ‘సుహానా’ నా ఇంటి యువరాణి. అతని సొంతం అనుకుంటే ఊరుకోను. నా కూతురితో అతని ప్రవర్తన ఎలా ఉంటుందో, అతనితో నా ప్రవర్తన కూడా అదే విధంగా ఉంటుంది...’ అని షారూక్ నవ్వుతూ చెప్పుకొచ్చాడు. కాగా, షారూక్ నటించిన ‘రయీస్’ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది.