ఆదివారం, 29 సెప్టెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 13 డిశెంబరు 2016 (13:38 IST)

థియేటర్లో జాతీయ గీతాన్ని పాడటం అవసరమా? ధృవ విలన్ అరవింద్ స్వామి

దేశానికి ప్రాతినిథ్యం వహించే చోట, క్రీడా కార్యక్రమాలలో జాతీయగీతం పాడితే అర్థం వుంటుందని, థియేటర్లలో పాడటం అర్థం లేని పని అంటూ నటుడు అరవింద్‌ స్వామి వ్యాఖ్యానించారు. జాతీయ గీతాన్ని ఎక్కడపడితే అక్కడ పాడ

దేశానికి ప్రాతినిథ్యం వహించే చోట, క్రీడా కార్యక్రమాలలో జాతీయగీతం పాడితే అర్థం వుంటుందని, థియేటర్లలో పాడటం అర్థం లేని పని అంటూ నటుడు అరవింద్‌ స్వామి వ్యాఖ్యానించారు. జాతీయ గీతాన్ని ఎక్కడపడితే అక్కడ పాడటం బాగుండదని.. సినిమా థియేటర్లలో జాతీయగీతం పాడాలన్న నిర్ణయంపై ధృవ సినిమా విలన్ అయిన అరవింద్ స్వామి అభ్యంతరం వ్యక్తం చేశాడు.

ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షిస్తే బాగుంటుందని అంటున్నాడు. అరవింద్‌స్వామి మాటల మీద అప్పుడే కొందరు మండిపడుతున్నారు. 'రోజా'లాంటి సినిమా చేసిన అరవింద్‌స్వామికి దేశభక్తి లేదని ఆరోపిస్తున్నారు. అయితే అరవింద్ స్వామి అభిప్రాయంతో కొందరు ఏకీభవిస్తున్నారు. 
 
ఇదిలా ఉంటే.. ధృవ సినిమాతో తెలుగుతెరకు అరవింద్ స్వామి లాంటి ఓ హ్యాండ్సమ్ విలన్ లభించాడని టాక్ వస్తోంది. థని ఒరువన్ సినిమాలో విలన్‌గా నటించిన అరవింద్ స్వామి… ఆ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కిన ధృవలో కూడా విలన్‌గా నటించాడు. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్‌గా నడుస్తోంది. మూవీలో చెర్రీ చేసిన పాత్రకు ఎంత రెస్పాన్స్ వస్తుందో… అదే స్థాయిలో అరవింద్ స్వామి పోషించిన రోల్‌కు కూడా అంతే మంచి రెస్పాన్స్ వస్తోంది.
 
ప్రతి ఒక్కరు అరవింద్ స్వామి పోషించిన పాత్ర గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. అప్పుడు రోజాలో నటించిన హీరోయేనా ఈ విలన్ మరికొందరు షాక్ అవుతున్నారు. తెలుగు ఆడియన్స్ నుంచి మంచి స్పందన రావడంతో అరవింద్ స్వామి హ్యాపీగా ఉన్నాడు. తనను ఆదరించిన టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపాడు. తన ట్విట్టర్ పేజ్ ద్వారా ఆనందాన్ని వ్యక్తం చేశాడు.