సోమవారం, 22 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 21 సెప్టెంబరు 2023 (10:59 IST)

"నా సామి రంగ"లో నాగార్జునతో ఆషికా రంగనాథ్ రొమాన్స్

Ashika Ranganath,
బెంగుళూరు బ్యూటీ ఆషికా రంగనాథ్ మరో భారీ తెలుగు చిత్రానికి సైన్ చేసింది. అక్కినేని నాగార్జున "నా సామి రంగ"లో ఆమె హీరోయిన్లలో ఒకరిగా ఎంపికైంది. ఇంకా నాగార్జున ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయనున్నారు. 
 
ప్రస్తుతం రెగ్యులర్ ప్రొడక్షన్ ప్రారంభమైంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు కనిపిస్తారు. ఆషికా రంగనాథ్‌ కథానాయికగా కన్‌ఫర్మ్ అయింది. కళ్యాణ్‌రామ్‌తో కలిసి ‘అమిగోస్‌’లో నటించిన ఆషికా రంగనాథ్‌ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకుంది. 
 
మరో హీరోయిన్ ఎవరన్నది ఇంకా చిత్ర నిర్మాతలు ఖరారు చేయలేదు. కొత్త దర్శకుడు విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న "నా సామి రంగ" 2024 సంక్రాంతికి విడుదల కానుంది.