బుధవారం, 1 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (11:09 IST)

నాగార్జున సోదరి నాగసుశీలపై కేసు నమోదు.. ఏం జరిగింది?

naga sushila
ప్రముఖ తెలుగు నటుడు అక్కినేని నాగార్జున సోదరి నాగసుశీలపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తమ శ్రీజ ప్రకృతి ధర్మ పీఠం ఆశ్రమంపై నాగసుశీల తదితరులు దాడి చేశారని చింతలపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
 
నాగసుశీల, శ్రీనివాస్‌లు కలిసి గతంలో చాలా సినిమాలను నిర్మించారు. వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు. కొన్నాళ్లుగా వీరి మధ్య భూ వివాదం నడుస్తోంది. ఇద్దరూ కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. అయితే శ్రీనివాస్ తనకు తెలియకుండా తన భూములను విక్రయించాడని నాగసుశీల గతంలో పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
మరోవైపు తనకు జైలుకెళ్లినా కంపెనీ ఆస్తులు రాసివ్వాలని నాగసుశీల తనపై కేసు పెట్టారని శ్రీనివాస్ ఆరోపించారు. నాగసుశీల కొడుకు సుశాంత్‌తో నాలుగు సినిమాలు చేసి భారీగా నష్టపోయానని చెప్పాడు. ఈ వివాదాల నేపథ్యంలోనే శ్రీనివాస్ నాగసుశీలపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.