సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: గురువారం, 12 మార్చి 2020 (17:59 IST)

రాశీఖన్నా, స్టార్ హీరోకి అలా జరుగబోతోందంటూ జ్యోతిష్కుడు వివాస్పద వ్యాఖ్యలు

రాశీ ఖన్నా
భారతదేశంలో జ్యోతిషానికి పెద్దపీట వేస్తారన్నది తెలిసిందే. తమ జన్మ నక్షత్రాలను అనుసరించి తమతమ జీవితం ఎలా వుండనుందనేది తెలుసుకునేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. ఇక సెలబ్రిటీల సంగతి వేరే చెప్పక్కర్లేదు. సినిమా ఏ సమయంలో ప్రారంభించాలన్న విషయం దగ్గర్నుంచి ఎప్పుడు విడుదల చేయాలన్న దానిపైనా మంచిరోజు, మంచి ఘడియలు చూసుకుని రంగంలోకి దిగుతారు.
 
ఇక అసలు విషయానికి వస్తే తెలుగు సంవత్సరాది ఉగాది ఈ నెల 25వ తేదీన రాబోతోంది. ఈ సందర్భంగా వివాదాస్పద జ్యోతిష్కుడుగా పేరున్న వేణుస్వామి కొన్ని వ్యాఖ్యలు చేశారు. అవేంటయా అంటే... ఉగాది తర్వాత రాశీ ఖన్నా స్టార్ డమ్ అదిరిపోతుందట. ఆమె ఏ చిత్రంలో నటించినా అది సూపర్ డూపర్ హిట్ అవుతుందట.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో తీవ్రమైన అనారోగ్యానికి గురవుతారట. అంతేకాదు యువ రాజకీయ నాయకుడు డెడ్లీ యాక్సిడెంటుకు గురవుతారట. మరో స్టార్ యాంకర్ జీవితం సమస్యల్లో పడుతుందనీ, అది విడాకుల దాకా వెళ్లే అవకాశం వుందని చెప్పుకొచ్చారు.

ఐతే రాశీ ఖన్నా పేరు తప్పించి మరెవరి పేర్లు ఆయన చెప్పలేదు. దీనిపై పలువురు మండిపడుతున్నారు. ఇదంతా పబ్లిసిటీ కోసం తప్పించి మరోటి కాదంటున్నారు. సమస్యల్లో పడేవారి పేరు కూడా చెప్పే దమ్ము లేనప్పుడు జ్యోతిషం ఎందుకు చెప్పడం అంటూ పలువురు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.