శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 8 డిశెంబరు 2017 (12:35 IST)

హాన్సికను బుట్టలో వేసిన తమిళ యువహీరో?

హీరోయిన్ హన్సిక ప్రేమ వ్యవహారం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలుత తమిళ కుర్రహీరో శింబుతో ప్రేమలో పడింది. వీరిద్దిరూ కొంతకాలం ప్రేమలో మునిగితేలారు.

హీరోయిన్ హన్సిక ప్రేమ వ్యవహారం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తొలుత తమిళ కుర్రహీరో శింబుతో ప్రేమలో పడింది. వీరిద్దిరూ కొంతకాలం ప్రేమలో మునిగితేలారు. వీరిద్దరి వివాహానికి శింబు తండ్రి టి.రాజేందర్ అడ్డు చెప్పడంతో అది పెటాకులైనట్టు సమాచారం. ఆ తర్వాత హన్సికను ఇపుడు మరో తమిళ హీరో లైన్లో పెట్టినట్టు సమాచారం. అతడు మరెవరో కాదు తమిళ నటుడు అధర్వ.
 
ఆమధ్య బాల దర్శకత్వంలో వచ్చిన సినిమా 'పరదేశీ'లో తన నటనతో అదరగొట్టాడు అధర్వ. ఇంతకన్నా చెప్పాలంటే.. తమిళ దివంగత నటుడు మురళీ తనయుడే ఈ అధర్వ. తన ప్రత్యేకతను చాటుకుంటూ సాగుతున్నాడు. ఈ క్రమంలో హన్సికకు ఇతడు పడిపోయాడనే టాక్ వినిపిస్తోంది తమిళనాడు నుంచి.
 
అధర్వ, హన్సికల మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ తమిళ పత్రికలు కోడై కూస్తున్నాయి. అయితే ఈ ప్రేమ వ్యవహారం గురించి... అధర్వ, హన్సికలు మాత్రం నోరుమెదపడం లేదు. ప్రస్తుతం వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రూమర్ వార్తల్లోకి వచ్చింది.