శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ప్రేమాయణం
  3. మధుర జ్ఞాపకాలు
Written By chj
Last Updated : గురువారం, 7 డిశెంబరు 2017 (16:58 IST)

శృంగారమే జీవితమైతే ఎంత ప్రమాదకరమో...

జీవితంలో శృంగారం ఒక భాగం కావాలే తప్ప జీవితమే శృంగారం కాకూడదు. అలా జరిగితే జీవితం గందరగోళంలో పడిపోతుంది. జీవితంలో ఇతర కార్యక్రమాలు చాలానే ఉంటాయి. వాటినన్నింటిపై దృష్టి పెట్టి అన్నింటికి సమ న్యాయం చేయాల

జీవితంలో శృంగారం ఒక భాగం కావాలే తప్ప జీవితమే శృంగారం కాకూడదు. అలా జరిగితే జీవితం గందరగోళంలో పడిపోతుంది. జీవితంలో ఇతర కార్యక్రమాలు చాలానే ఉంటాయి. వాటినన్నింటిపై దృష్టి పెట్టి అన్నింటికి సమ న్యాయం చేయాలి. అలా కాకుండా శృంగారంలో మునిగిపోయి పోర్న్ సినిమాలు చూస్తే మాత్రం జీవితం పూర్తిగా నాశనమైపోతుంది.
 
కొంతమంది యువత ఎవరితోనైనా పరిచయం కలిగితే వారితో శారీరకంగా కలవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తుంటారు. ఉదయం లేచినప్పటి నుంచి ఆఫీస్‌కు వెళ్ళేంత వరకు పరిచయమైన వ్యక్తిని తరచూ గుర్తుచేసుకుంటూనే ఉంటారు. ఇదంతా అనుకోకుండానే జరుగుతుంది. ఎందుకంటే ఆలోచన మొత్తం శృంగారపైనే ఉంటుంది కాబట్టి.
 
శృంగారంపైనే ఎక్కువ దృష్టి పెడుతుంటారు కాబట్టి మిగిలిన ఏ విషయాలపైనా ఆలోచనలు వుండవు. శృంగారానికి బానిసలయ్యారనడానికి ఇదో ఉదాహరణ. తాత్కాలికమైన శృంగారం కోసం వేరే వారి ప్రమేయాన్ని కూడా ఇందులో ఒక్కోసారి కొంతమంది చేరుస్తుంటారు. ఇది చాలా ప్రమాదకరం.
 
కొంతమంది చుట్టూ ఉన్న స్నేహితులతో బాగానే మాట్లాడుతున్నట్లు ఉంటారు. కానీ వారి ఆలోచన మొత్తం శృంగారంపైనే వెళుతుంటాయి. ఈ ఆలోచనలను నియంత్రించుకోవడం చాలా మంచిది. నిరంతర ఆలోచనలు నిస్సత్తువ చేస్తాయి. ఇలాంటి ఆలోచనలు వస్తుంటే వెంటనే యోగా చేయడం ప్రారంభించాలి. లేకుంటే ఆశ్రమానికి వెళ్ళాలి. అదీ కుదరకపోతే భక్తి తత్వంపై ఎక్కువ దృష్టి మరల్చాలి. అప్పుడు ఈజీగా వీటి నుంచి బయటపడవచ్చు.