శుక్రవారం, 22 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వార్తలు
Written By chj
Last Modified: గురువారం, 9 నవంబరు 2017 (19:41 IST)

నిద్ర సరిగ్గా పోకుంటే ఎంత ప్రమాదమో తెలుసా?

ప్రతి మనిషికి నిద్ర ఎంతో అవసరం. కడుపు నిండా భోజనం.. కంటి నిండా నిద్ర అన్న సామెత ఉంది. అందుకే పెద్దవారు ఈ రెండు తు.చ తప్పకుండా పాటించాలంటారు. ఇదంతా బాగానే ఉంది కానీ భోజనం కన్నా నిద్ర ప్రధానమని ఒక పరిశోధనలో తేలింది. కంటి నిండా నిద్ర లేకుంటే మాత్రం ఇబ్బ

ప్రతి మనిషికి నిద్ర ఎంతో అవసరం. కడుపు నిండా భోజనం.. కంటి నిండా నిద్ర అన్న సామెత ఉంది. అందుకే పెద్దవారు ఈ రెండు తు.చ తప్పకుండా పాటించాలంటారు. ఇదంతా బాగానే ఉంది కానీ భోజనం కన్నా నిద్ర ప్రధానమని ఒక పరిశోధనలో తేలింది. కంటి నిండా నిద్ర లేకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవని, మెదడుకు అందాల్సిన సంకేతాలు సరిగ్గా అందకుండా మనుషులు చనిపోయే అవకాశముందని పరిశోధనలో తేలింది. 
 
ఇప్పటికే పదిమందిపై పరిశోధనలు కూడా కొంతమంది వైద్యనిపుణులు చేశారట. సరిగ్గా నిద్రపోని వారు రోడ్డుప్రమాదాల్లో చనిపోవడం, ఎవరితోనైనా మాట్లాడుతుండగా కళ్ళు తిరిగి పడిపోవడం లాంటి ప్రమాదాలు జరిగినట్లు గుర్తించారు. అందుకే సమయానికి పడుకోవడం నేర్చుకోవాలట. ఒకవేళ రాత్రివేళల్లో నిద్రపోకుంటే మధ్యాహ్నం గంటసేపు మాత్రం ఖచ్చితంగా పడుకోవాలంటున్నారు వైద్య నిపుణులు.