శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 13 జనవరి 2022 (11:55 IST)

అవతార్‌-2 విడుదలకు రంగం సిద్ధం: 2022, డిసెంబర్ 16న ముహూర్తం

అవతార్‌కు సీక్వెల్ వచ్చేస్తోంది. 2009లో కామెరాన్ అవతార్‌తో ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఆ సినిమా బాక్సాఫీస్ రికార్డులను అన్నింటిని బద్దలు కొట్టింది. ఆ తరువాత ‘అవతార్’కి నాలుగు సీక్వెల్స్ రెడీ చేసే పనిలో పడ్డాడట కామెరూన్ అందులో భాగంగా ‘అవతార్ 2’ను ఈ ఏడాది అంటే 2022, డిసెంబర్ 16న థియేటర్లలో విడుదల చేయబోతున్నాడు. 
 
పండోర గ్రహంలోని నీటి అడుగున ఉన్న దిబ్బల మధ్య కొత్త తెగకు చెందిన ప్రజలను ఈ సీక్వెల్స్ లో పరిచయం చేబోతున్నారట. ఈ సీక్వెల్స్‌లో రెగ్యులర్ తారాగణంతో పాటు కేట్ విన్స్లెట్ మరియు విన్ డీజిల్‌తో పాటు మరి కొంత మంది నటీనటులు కొత్తగా యాడ్ అయ్యారని సమాచారం. 
 
రెండో సీక్వెల్‌ను 2024 డిసెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుండగా.. మూడవ సీక్వెల్ 2026 డిసెంబర్‌లో అలాగే చివరిదైన నాలుగో సీక్వెల్ చిత్రం 2028 డిసెంబర్‌లో విడుదల అవుతాయని సమాచారం.