సోమవారం, 27 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By selvi
Last Updated : శనివారం, 17 జూన్ 2017 (10:43 IST)

కొత్త గెటప్‌లో ఇలియానా.. క్లాసిక్ లుక్‌లో బోల్డ్ అండ్ బ్యూటీ ఫుల్‌‌గా..

బర్ఫీ చిత్రంలో ఇలియానా విభిన్న రోల్‌తో ఆకట్టుకుంది. ఇప్పుడు మరో కొత్త గెటప్‌లో ప్రేక్షకులను అలరించబోతోంది. ఆ చిత్రమే ''బాద్‌షా హో''. మిలాన్‌ లుత్రియా తెరకెక్కిస్తున్నారు. అజయదేవగణ్‌, విద్యుత్‌ జమ్వాల్

బర్ఫీ చిత్రంలో ఇలియానా విభిన్న రోల్‌తో ఆకట్టుకుంది. ఇప్పుడు మరో కొత్త గెటప్‌లో ప్రేక్షకులను అలరించబోతోంది. ఆ చిత్రమే ''బాద్‌షా హో''. మిలాన్‌ లుత్రియా తెరకెక్కిస్తున్నారు. అజయదేవగణ్‌, విద్యుత్‌ జమ్వాల్‌, ఇషా గుప్తా, ఇమ్రాన్‌ హాష్మి నటిస్తున్నారు. 1975ల్లో ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధించారు. ఆ సమయంలో ఏం జరిగింది అనే నేపథ్యంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.
 
కొద్ది రోజులుగా చిత్రంలోని ప్ర‌ధాన పాత్ర‌ల‌కి సంబంధించిన పోస్ట‌ర్స్‌ని విడుద‌ల చేస్తున్న చిత్ర యూనిట్ తాజాగా ఇలియానా లుక్ విడుద‌ల చేసింది. క్లాసిక్ లుక్‌లో ఉన్న ఇలియానాని చూసి ఫ్యాన్స్ భారీగా ఆలోచ‌న‌లు చేస్తున్నారు. బోల్డ్ అండ్ బ్యూటీ ఫుల్‌గా ఉన్న ఇలియానా లుక్ అభిమానుల‌కు మాత్రం మంచి కిక్ ఇస్తుంది. ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన పోస్టర్స్‌ని బ‌ట్టి చూస్తుంటే సినిమా ఓ రేంజ్‌లో ఉంటుంద‌నే అభిప్రాయం అభిమానుల‌లో క‌లుగుతుంది.