మంగళవారం, 3 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : ఆదివారం, 21 మే 2017 (16:00 IST)

అదీఇదీ కలుపుకుంటే రూ.2 వేల కోట్లు దాటింది : రికార్డులు తిరగరాస్తున్న 'బాహుబలి'

'బాహుబలి' చిత్రం సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. స్వదేశంలోనే కాకుండా, విదేశాల్లో సైతం కనకవర్షం కురిపిస్తోంది. 'బాహుబలి : ది బిగినింగ్', 'బాహుబలి 2 : ది కంక్లూజన్ చిత్రాలు సరికొత్త చరిత్రను సృష్టి

'బాహుబలి' చిత్రం సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. స్వదేశంలోనే కాకుండా, విదేశాల్లో సైతం కనకవర్షం కురిపిస్తోంది. 'బాహుబలి : ది బిగినింగ్', 'బాహుబలి 2 : ది కంక్లూజన్ చిత్రాలు సరికొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి. ఈ రెండు చిత్రాలు కలుపుకుంటే ఏకంగా రెండు వేల కోట్ల రూపాయల మేరకు కలెక్షన్లు సాధించింది. బాహుబలి-1 రూ 650 కోట్లు.. బాహుబలి-2 రూ. 1500 కోట్లు.. వెరసి 2150 కోట్లుగా నమోదైంది. 
 
టాలీవుడ్‌ జక్కన్న రాజమౌళి చేతిలో ప్రాణంపోసుకున్న బాహుబలి గత నెల 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెల్సిందే. నాటి నుంచి కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రెండు భాగాలూ కలిపి రూ.2 వేల కోట్లకు పైగా వసూలు చేసి ఆల్‌టైం రికార్డు సృష్టించింది. 
 
ఇక బాహుబలి-2 అయితే సినిమా రంగాన్ని ఓ కుదుపు కుదిపింది. ప్రపంచ వ్యాప్తంగా 21 రోజుల్లోనే రూ.1500 కోట్లు వసూలు చేసింది. ఇంత పెద్ద ఎత్తున వసూళ్లు సాధించిన మొదటి భారతీయ చిత్రంగా నిలిచింది.