శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శనివారం, 5 ఆగస్టు 2017 (11:57 IST)

100 రోజులు పూర్తి చేసుకున్న బాహుబలి-2: ఇక చైనాలో రిలీజ్‌కు రెడీ?

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి 2 సినిమా వందరోజులను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం ఏప్రిల్ 28, 2017న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళం భాష‌ల‌లో

దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన బాహుబలి 2 సినిమా వందరోజులను పూర్తి చేసుకుంది. ఈ చిత్రం ఏప్రిల్ 28, 2017న విడుద‌లైన సంగ‌తి తెలిసిందే. తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ల‌యాళం భాష‌ల‌లో విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డుల‌ని బద్ధలు కొట్టింది. 
 
ప్రపంచ వ్యాప్తంగా 1000కి మించిన స్క్రీన్లలో 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో శుక్రవారంతో వంద రోజులు పూర్తి చేసుకుని.. ఆల్ టైం ఇండియ‌న్ బిగ్గెస్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రంగా చ‌రిత్ర సృష్టించింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ భారత సినిమా కూడా 50 రోజుల త‌ర్వాత వెయ్యి సెంట‌ర్లలో ఆడింది లేదు. 
 
కానీ బాహుబలి వందరోజుల పాటు ఎన్ని సెంటర్స్‌లో పూర్తి చేసుకుందని క్లారిటీ రాలేదు. ఇకపోతే.. బాహుబ‌లి 2 చిత్రం త్వ‌ర‌లో చైనాలో విడుదలయ్యేందుకు రెడీ అవుతోంది. ప్ర‌భాస్, రానా, అనుష్క‌, త‌మ‌న్నా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో ఆర్కా మీడియా వ‌ర్క్స్ బేన‌ర్ పై ఈ మూవీ నిర్మిత‌మైంది. 
 
విడుదలైన రోజు నుండే కలెక్షన్ల సునామీ సృష్టించిన ఈసినిమా ఇప్పటివరకు దాదాపుగా 2000 కోట్ల కలెక్షన్లను సాధించి తెలుగువాడి సత్తాను ప్రపంచానికే చాటి చెప్పింది. తాజాగా వంద రోజుల మైలురాయిని దాటిన సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్ విడుదల చేశారు యూనిట్ సభ్యులు.