గురువారం, 28 నవంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 18 జూన్ 2017 (18:16 IST)

చైనాలో బాహుబలి2.. సెప్టెంబరులో విడుదల.. దంగల్ రికార్డును బ్రేక్ చేస్తుందా?

చైనాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న అమీర్ ఖాన్ దంగల్ ఏకంగా 1000 కోట్ల వసూళ్లతో రికార్డు సృష్టించింది. బాలీవుడ్‌ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన రియల్ లైఫ్ స్పోర్ట్స్ డ్రామా ''దంగల్'' చ

చైనాలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అనిపించుకున్న అమీర్ ఖాన్ దంగల్ ఏకంగా 1000 కోట్ల వసూళ్లతో రికార్డు సృష్టించింది. బాలీవుడ్‌ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించిన రియల్ లైఫ్ స్పోర్ట్స్ డ్రామా ''దంగల్'' చైనాలో అత్యధిక వసూళ్లు సాధించిన బాలీవుడ్ (భారత్) సినిమాగా నిలిచింది. ఈ నేపథ్యంలో చైనాలో మరో భారతీయ సినిమా బాహుబలి రిలీజై తన సత్తా చాటేందుకు రెడీ అయ్యింది. 
 
భారతీయ సినీ చరిత్రలో 1500 కోట్ల వసూళ్లను సాధించిన బాహుబలి-2 చైనాలోని 4 వేల థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది. ఈ ఏడాది సెప్టెంబ‌ర్‌లో సినిమా రిలీజ్ కానున్న‌ట్లు ట్రేడ్ అన‌లిస్ట్ ర‌మేష్ బాలా వెల్ల‌డించాడు. బాహుబ‌లి స్టార్సంతా ప్ర‌మోష‌న్ కోసం చైనా వెళ్ల‌నున్న‌ట్లు సమాచారం. చైనాలో దంగ‌ల్‌ను ప్రమోట్ చేసిన డిస్ట్రిబ్యూష‌న్ కంపెనీనే బాహుబ‌లి 2 మేక‌ర్స్ సంప్ర‌దించారు. 
 
దంగ‌ల్ ఇండియాలో కంటే చైనాలోనే ఎక్కువ క‌లెక్ష‌న్లు రాబ‌ట్టిన సంగతి తెలిసిందే. ఇదే కంపెనీ ప్రమోట్ చేస్తే బాహుబ‌లి 2 చైనాలోనూ రికార్డులు కొల్ల‌గొట్ట‌డం ఖాయ‌మ‌ని సమాచారం. ఇదే జరిగితే దంగల్ రికార్డును బ్రేక్ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదని సినీ పండితులు అంచనా వేస్తున్నారు. కానీ బాహుబలి చైనా ప్రజలకు కనెక్ట్ అవుతాడో లేదో చూడాలి.