'ఆర్ఆర్ఆర్' టీమ్ దీపావళి సంబరాలు... స్పెషల్ ఫోటో ఫీచర్...

rrr diwali still
ఠాగూర్| Last Updated: శుక్రవారం, 13 నవంబరు 2020 (12:47 IST)
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ హీరోలు. ఈ సినిమాలో కొమరం భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరావు రాం చరణ్ నటిస్తున్నారు. ఈ చిత్ర బృందం దీపావళి సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ సంబరాలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
rrr diwali still

ఫోటోల్లో హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రాం చరణ్‌లతో కలిసి రాజమౌళి సంభాషణ జరుపుతున్నారు. చిరునవ్వులు చిందిస్తూ వారు పోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన పలు ఫొటోలను 'ఆర్ఆర్ఆర్' టీమ్ పోస్ట్ చేసింది.
rrr diwali still


తెలుపు రంగు దుస్తుల్లో దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటున్నట్లు ఎన్టీఆర్, రాంచరణ్ కనపించారు. సినిమా గురించి తారక్, చెర్రీకి రాజమౌళి వివరిస్తున్నట్లు ఓ ఫొటో ఉంది. వారి ముగ్గురి వెనుక ఆర్ఆర్ఆర్ అనే అక్షరాలు కనపడుతున్నాయి.
rrr diwali still

రాజమౌళి, రామారావు, రామ్ చరణ్ పేర్లు కలిసేలా ఈ సినిమా పేరు పెట్టిన విషయం తెలిసిందే. ఆ తర్వాత చెర్రీ, తారక్ కలిసి, అలాగే విడివిడిగా కూడా ఫొటోలకు పోజులిచ్చారు.
rrr diwali still

కాగా, ఈ సినిమా యూనిట్ ఇప్పటికే విడుదల చేసిన
'భీమ్‌ ఫర్‌ రామరాజు', 'రామరాజు ఫర్ భీమ్' టీజర్లు అలరించిన విషయం తెలిసిందే. కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్‌ ఈ టీజర్లలో అలరించారు.దీనిపై మరింత చదవండి :